క్రీడాభూమి

వెంటాడుతున్న గాయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సౌతాంప్టన్, జూన్ 20: వరుస విజయాలతో దూసుకుపోతున్న టీమిండియాను గాయాలు వెంటాడుతున్నాయ. ఇప్పటికే చేతి వేలికి గాయం కారణంగా ఓపెనర్ శిఖర్ ధావన్ టోర్నీ నుంచి దూ రం కాగా, తొడ కండరాలు పట్టేయడంతో మీడి యం పేసర్ భువనేశ్వర్ కుమార్ కొన్ని మ్యాచ్‌లకు అందుబాటులో ఉండడం లేదు. తాజాగా అఫ్గాని స్తాన్‌తో శనివారం జరిగే మ్యాచ్ కోసం నెట్ ప్రాక్టీస్ చేస్తుండగా ఆల్ రౌండర్ విజయ్ శంకర్ కూడా గాయపడడంతో జట్టు సభ్యులతో పాటు టీమ్ మేనేజ్‌మెంట్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. నెట్ ప్రాక్టీస్‌లో భాగంగా జస్ప్రీత్ బుమ్రా వేసిన యా ర్కర్‌కి విజయ్ శంకర్ కాలికి తీవ్ర గాయమైంది. దీంతో అఫ్గాన్‌తో జరిగే మ్యాచ్‌కు అందుబాటులో ఉంటాడో, లేదో తెలాల్సి ఉంది. మరోవైపు ధావన్ స్థానంలో జట్టుతో కలిసిన రిషభ్ పంత్‌కు తుది జట్టులో చోటు దక్కుతుందా లేదా అనేది ఇప్పటి వరకు స్పష్టత లేదు. వచ్చే మ్యాచ్‌లోపు విజయ్ శంకర్ కోలుకోలేకుంటే పరిస్థితి ఏంటానేది మేనేజ్ మెంట్ ఆలోచనలో పడింది. పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భువనేశ్వర్ కుమార్ గాయపడడంతో బౌలింగ్‌కు దిగిన విజయ్ శంకర్ రెండు వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. మరోవైపు నాలుగో స్థానంలో బ్యాటింగ్ ఎవరు చేస్తారనేది కూడా చెప్పలేకుండా ఉంది. దీనిపై జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు టీమ్ మేనేజ్‌మెంట్ స్పందిస్తే గాని అఫ్గాన్‌తో మ్యాచ్‌కి తుది జట్టులో ఎవరికి చోటు దక్కు తుందనేది తెలియనుంది.

చిత్రం...ఆల్‌రౌండర్ విజయ్ శంకర్