క్రీడాభూమి

షమీ @ 10

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సౌతాంప్టన్, జూన్ 23: టీమిండియా పేసర్ మహమ్మద్ షమీ అఫ్గానిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో హ్యాట్రిక్ సాధించి అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఈ మ్యాచ్ చివరి ఓవర్‌లో హ్యాట్రిక్ సాధించిన షమీ ప్రపంచకప్‌లో ఈ ఫీట్ సాధించిన రెండో భారత బౌలర్‌గా, ఓవరాల్‌గా 10వ బౌలర్‌గా నిలిచాడు. 1987లో జరిగిన ప్రపంచకప్‌లో భారత్‌కు చెందిన చేతన్ శర్మ న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలిసారిగా హ్యాట్రిక్ సాధించి, ప్రపంచకప్‌లోనే ఈ ఘనత సాధించిన తొలి బౌలర్‌గా నిలిచాడు. 32 ఏళ్ల తర్వాత మహమ్మద్ షమీ అఫ్గానిస్తాన్ హ్యాట్రిక్ సాధించి రెండో భారత బౌలర్‌గా అరుదైన ఘనత అందుకున్నాడు. ఇక పరిమిత ఓవర్ల క్రికెట్‌లో భారత్ తరఫున చేతన్ శర్మ (1987), కపిల్ దేవ్ (1990-91), కుల్దీప్ యాదవ్ (2017) తర్వాత మహమ్మద్ షమీ (2019) హాట్రిక్ సాధించిన నాలుగో బౌలర్‌గా నిలిచాడు.