క్రీడాభూమి

వెనుకడుగు వేయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, జూన్ 26: ఇది మా ప్రపంచకప్. ‘నాలుగేళ్లుగా మాకు లభించిన మద్దతు వెలకట్టలేనిది. ఈ టోర్నీ ఎంత కీలకమో మాకు తెలుసు. క్రికెట్‌లోనే ఇదో అద్భుత సమయం. ఈ మెగా టోర్నీకి దేశం తరఫున ప్రాతినిధ్యం వహించడం గొప్ప విషయం. వెనుకడుగు వేసే ముచ్చటే లేదు’ అని ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ స్పష్టం చేశాడు. పరాజ యాలు ప్రపంచకప్ నుంచి తమని తప్పించలేవన్నాడు. ఆస్ట్రేలి యాతో జరిగిన మ్యాచ్‌లో 64 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ ఓడిపోయిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో బెన్ స్టోక్స్ అర్ధ సెంచరీతో పోరాడిన జట్టును పరాజయం నుంచి కాపాడలేక పోయాడు. మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడిన స్టోక్స్ మా జట్టులో ముగ్గురు, నలుగురు ఆటగాళ్లు రాణిస్తే తిరు గుండదని పేర్కొన్నాడు. వచ్చే మ్యాచ్‌లపై సరైన ప్రణాళికలు రచిస్తామని చెప్పాడు. భారత్‌పై తమకు మంచి రికార్డు ఉందని, మేం మా శక్తి మేరకు పోరాడుతామని స్టోక్స్ చెప్పాడు.

చిత్రం...ఆస్ట్రేలి యాతో జరిగిన మ్యాచ్‌లో మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో బౌల్డ్ అయిన బెన్ స్టోక్స్