క్రీడాభూమి

గెలిస్తేనే ఆశలు సజీవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెస్టర్ లీ స్ట్రీట్, జూన్ 27: ప్రపంచ కప్ క్రికెట్ చాంపియన్‌షిప్‌లో సెమీస్ చేరే అవకాశాలను సజీవంగా నిలబెట్టుకోవాలంటే, తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాను శ్రీలంక ఎదుర్కోనుంది. శుక్రవారం జరిగే ఈ మ్యాచ్‌లో జయాపజయాలు దక్షిణాఫ్రికాపై ఎలాంటి ప్రభావం చూపవు. ఇంత వరకూ ఆడిన ఏడు గ్రూప్ మ్యాచ్‌ల్లో కేవలం ఒక మ్యాచ్‌ని మాత్రమే గెలిచిన దక్షిణాఫ్రికా ఐదు పరాజయాలను ఎదుర్కొంది. ఒక మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. మొత్తం మీద మూడు పాయింట్లను మాత్రమే సంపాదించుకున్న ఈ జట్టు ఇప్పటికే టోర్నీ నుంచి నిష్క్రమించింది. కాబట్టి శ్రీలంకతో, ఆతర్వాత ఆస్ట్రేలియాతో జూలై ఆరున మాంచెస్టర్‌లో జరిగే మ్యాచ్‌లకు ప్రాధాన్యత ఉండదు. అందుకే, ఈ రెండు మ్యాచ్‌లను దక్షిణాఫ్రికా క్రికెటర్లు తమతమ వ్యక్తిగత రికార్డులు లేదా ఇతరత్రా గణాంకాల కోసమే ఆడతారు. ఈ టోర్నీలో విఫలమైన ఆటగాళ్లు మళ్లీ ఫామ్‌లోకి రావడానికి శ్రీలంక, ఆస్ట్రేలియా జట్లతో జరిగే మ్యాచ్‌లు ఉపయోగపడతాయి. అదే విధంగా జట్టు కూర్పులో మార్పులు చేర్పులు చేసి, ప్రయోగాలను చేపట్టేందుకు కూడా ఇదే సరైన అవకాశం. వరల?డ కప్ సెమీస్ ఆశలు లేనందున దక్షిణాఫ్రికాపై ఎలాంటి ఒత్తిడి ఉండదు. కాబట్టి, ఆటగాళ్లంతా స్వేచ్ఛగా ఆడితే, శ్రీలంకకు కష్టాలు తప్పకపోవచ్చు.
కరుణరత్నే సేనపై ఒత్తిడి
తిముత్ కరుణరత్నే నాయకత్వంలోని శ్రీలంక జట్టు తీవ్రమైన ఒత్తిడికి లోనవుతున్నది. సాంకేతికంగా చూస్తే, ఈ జట్టు సెమీస్ అవకాశాలను ఇంకా కోల్పోలేదు. ఏమాత్రం ఫామ్‌లో లేని దక్షిణాఫ్రికాను ఓడిస్తే, ఆతర్వాత జూలై ఒకటిన చెస్టర్ లీ స్ట్రీట్‌లో వెస్టిండీస్‌పై గెలవడం కష్టం కాకపోవచ్చు. దక్షిణాఫ్రికా మాదిరిగానే వెస్టిండీస్ కూడా మూడు పాయింట్లు మాత్రమే సంపాదించి, కష్టాల్లో ఉంది. ఈ జట్టుకు కూడా సెమీస్ ఆశలు గల్లంతయ్యాయి. జట్టు సభ్యులంత నిలకడలేని ఆటతో అభిమానులను నిరాశపరుస్తున్నారు. అందుకే, విండీస్‌పై లంక విజయం సాధిస్తుందని అభిమానులు ఆశతో ఉన్నారు. అయితే, శుక్రవారం నాటి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాను ఓడిస్తేనే, విండీస్‌తో మ్యాచ్‌కి ప్రాధాన్యం ఉంటుంది. లేకపోతే, టోర్నీ నుంచి నిష్క్రమించడం ఖాయమవుతుంది. ఆతర్వాత విండీస్‌పై, జూలై ఆరున లీడ్స్‌లో ఇండియాపై విజయాలు సాధించినప్పటికీ ఫలితం ఉండదు. ఈ నేపథ్యంలో, దక్షిణాఫ్రికాతో మ్యాచ్ ఎంతో కీలకంగా మారింది.
ట్రంప్ కార్డ్ మలింగ
శ్రీలంక జట్టుకు సీనియర్ ఫాస్ట్ బౌలర్ లసిత్ మలింగ ట్రంప్ కార్డుగా మారాడు. లంకకు ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందించిన అతను ప్రపంచ కప్‌లోనూ మెరుగైన సేవలతో అభిమానులను ఆకట్టుకుంటున్నాడు. 2007 వరల్డ్ కప్‌లో దక్షిణాఫ్రికాపై నాలుగు వరుస బంతుల్లో నాలుగు వికెట్లు సాధించిన మలింగ ఆల్‌టైమ్ గ్రేట్ బౌలర్ల ‘టాప్-10’ జాబితాలో చోటు సంపాదించాడు. చెస్టర్ లీ స్ట్రీట్ వాతావరణ పరిస్థితులను అతను తనకు అనుకూలంగా మార్చుకుంటాడనంలో సందేహం లేదు. వరల్డ్ కప్ టోర్నీకి రాకముందు, ఐపీఎల్‌లో 16 వికెట్లు సాధించిన మలింగ ముంబయి ఇండియన్స్ నాలుగోసారి టైటిల్ అందుకోవడంలో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. దక్షిణాఫ్రికాతో జరిగే కీలక మ్యాచ్‌లో అతని నుంచి అభిమానులు అదే స్థాయిలో రాణిస్తాడని ఆశిస్తున్నారు. 2007లో దక్షిణాఫ్రికాపై, ఆతర్వాత 2011లో కెన్యాపై హ్యాట్రిక్స్ సాధించిన మలింగ తాను మూడో హ్యాట్రిక్‌ను నమోదు చేయడం కష్టమేమోగానీ, అసాధ్యమేమీ కాదని ఇది వరకే వ్యాఖ్యానించాడు. ఆ ఆత్మవిశ్వాసమే అతని బౌలింగ్ ప్రతిభను మరింత మెరుగు పరుస్తుందని విశే్లషకులు అంటున్నారు. కాగా, యువ ఆటగాళ్లు ఎక్కువగా ఉన్నారని, వారంతా ప్రతిభావంతులేనని జట్టు మేనేజ్‌మెంట్ అంటున్నది. సీనియర్లు, యువకుల కలయికతో జట్టు సమతూకంగా ఉందని లంక క్రికెట్ అధికారుల అభిప్రాయం. అయితే, అంతర్జాతీయ స్థాయి టోర్నీలో ఆడిన అనుభవం కొంత మంది ఆటగాళ్లకు తక్కువగా ఉండడమే పరాజయాలకు కారణమని అభిప్రాయపడుతున్నారు. ఒత్తిడి తీవ్రంగానే ఉన్నప్పటికీ, దక్షిణాఫ్రికాతో అమీతుమీ తేల్చుకోవడానికి శ్రీలంక క్రికెటర్లు సిద్ధమయ్యారు. కేవలం కోటా మ్యాచ్‌లను పూర్తి చేయాలి కాబట్టే ఇంకా వరల్డ్ కప్‌లో కొనసాగుతున్న దక్షిణాఫ్రికాను ఓడించేందుకు వ్యూహరచన చేస్తున్నారు. శ్రీలంక ఇంత వరకూ ఆరు మ్యాచ్‌లు ఆడి, రెండు విజయాలు నమోదు చేసింది. రెండు పరాజయాలను ఎదుర్కొంది. మరో రెండు మ్యాచ్‌ల్లో ఫలితాలు వెల్లడి కాలేదు.
ఫాబియన్ అలెన్ బౌలింగ్‌లో ధోనీ స్టంప్ అయ్యే ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నాడు. విండీస్ వికెట్‌కీపర్ షాయ్ హోప్ గందరగోళపడి, ధోనీని స్టంప్ చేయలేకపోయాడు. గత మ్యాచ్‌లోనూ, ఆరంభంలోనే స్టంపింగ్ ప్రమాదం నుంచి బయటపడిన ధోనీ, ఈ మ్యాచ్‌లో ఎనిమిది పరుగుల వ్యక్తిగత స్కోరువద్ద అదే తరహాలో ఔట్ కాకుండా ఊపిరి పీల్చుకున్నాడు. 56 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. అతనికి లైఫ్ ఇచ్చినందుకు విండీస్ భారీగానే నష్టపోయింది.