క్రీడాభూమి

వనే్డ ర్యాంకింగ్స్‌లో టీమిండియా టాప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాంచెస్టర్, జూన్ 27: వనే్డ ఇంటర్నేషనల్స్ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ఇంగ్లాండ్‌ను రెండో స్థానానికి నెట్టిన టీమిండియా నంబర్ వన్‌గా నిలిచింది. మరో మూడు రోజుల్లో ఇంగ్లాండ్‌తో ప్రపంచ కప్ క్రికెట్ చాంపియన్‌షిప్ గ్రూప్ మ్యాచ్ ఆడనున్న భారత్ తాజా ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని ఆక్రమించింది. భారత్ ఖాతాలో మొత్తం 123 పాయింట్లు ఉండగా, ఇంగ్లాండ్ 122 పాయింట్లతో రెండో స్థానానికి పడిపోయింది. 114 పాయింట్లు సంపాదించిన న్యూజిలాండ్‌కు మూడో స్థానం దక్కింది. ఈ టోర్నమెంట్‌లో సెమీస్ చేరిన తొలి జట్టు, డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా ప్రపంచ ర్యాంకింగ్స్‌లో మాత్రం 112 పాయింట్లతో నాలుగో స్థానంతో సంతృప్తి చెందాల్సి వచ్చింది. కాగా, ఈనెల 30న ఇంగ్లాండ్‌తో బర్మింహామ్‌లో జరిగే మ్యాచ్ ఫలితం ఈ టోర్నీపై తీవ్ర ప్రభావం చూపుతుందని అంటున్నారు.