క్రీడాభూమి

రోహిత్ అసంతృప్తి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాంచెస్టర్, జూన్ 28: ప్రపంచ కప్ క్రికెట్ చాంపియన్‌షిప్‌లో ఫీల్డ్ అంపైర్లు, థర్డ్ అంపైర్లు తీసుకుంటున్న నిర్ణయాలపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న ఆటగాళ్ల సరసన భారత స్టార్ బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మ కూడా చేరాడు. గురువారం వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో, 23 బంతుల్లో 18 పరుగులు చేసిన రోహిత్‌ను కెమెర్ రోచ్ బౌలింగ్‌లో వికెట్‌కీపర్ షాయ్ హోప్ క్యాచ్ పట్టినట్టు ప్రకటించి, పెవిలియన్‌కు పంపారు. అయితే, ట్విటర్ వేదికగా ఈ నిర్ణయంపై రోహిత్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. నిజానికి బంతి బ్యాట్‌తోపాటు తన ప్యాడ్‌కు కూడా తగిలిందని వివరించాడు. బ్యాట్ అండ్ ప్యాడ్ బంతిని క్యాచ్‌గా గుర్తించరు. సంఘటన వివరాల్లోకి వెళితే, రోచ్ వేసిన ఇన్ స్వింగర్‌ను రక్షణాత్మక విధానంలో అడేందుకు రోహిత్ ప్రయత్నించాడు. అయితే, అది మెరుపు వేగంతో దూసుకెళ్లగా, షాయ్ హోప్ అందుకున్నాడు. విం డీస్ ఫీల్డర్లంతా అప్పీల్ చేసినప్పటికీ, ఆన్‌ఫీల్డ్ అంపైర్ రిచర్డ్ లిలింగ్‌వర్త్ ఔట్ ఇవ్వలేదు. దీనితో విండీస్ కెప్టెన్ జాసన్ హో ల్డర్ రివ్యూకు వెళ్లాడు. క్లిప్పింగ్స్‌ను థర్డ్ అంపైర్ మైఖేల్ గాఫ్ పరిశీలించి, రోహిత్‌ను ఔట్‌గా ప్రకటించాడు. థర్డ్ అంపైర్ నిర్ణయాన్ని సవాలు చేసే అవకాశం లేకపోవడంతో, రోహిత్ వెనుతిరగక తప్పలేదు. అయితే, అతని ముఖంలో అసహనం, అ సంతృప్తి కొట్టొచ్చినట్టు కనిపించిం ది. ఇదే అంశాన్ని అతను ట్విటర్‌లో ప్రస్తావించా డు. తాను ఔట్ కాలేదని స్పష్టం చేశాడు. బంతి తన ప్యాడ్స్‌కు తగిలినట్టు తెలిపాడు. కాగా, స్నికో మీటర్‌లో రికార్డయిన శబ్దం ఆధారంగా మైఖేల్ గాఫ్ నిర్ణ యం తీసుకున్నట్టు నిపుణులు అంటున్నా రు. మొత్తం మీద రోహిత్ ఔట్ అంశం వి వాదంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.