క్రీడాభూమి

విజయ్‌శంకర్ నుంచి త్వరలో భారీ ఇన్నింగ్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బర్మింగ్‌హామ్, జూన్ 29: తరుచూ విఫలమై విమర్శలు ఎదుర్కొంటున్న టీమిండియా ఆల్‌రౌండర్ విజయ్ శంకర్‌కు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ అండగా నిలిచాడు. ప్రపంచకప్‌లో ఇప్పటివరకు రాణించని విజయ్ శంకర్ స్థానంలో యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్‌ను తీసుకోవాలంటూ విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై ప్రీ మ్యాచ్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన కోహ్లీ విజయ్ శంకర్ నుంచి భారీ ఇన్నింగ్స్‌ను చూసే అవకాశం దగ్గర్లోనే ఉందన్నాడు. పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో విజయ్ శంకర్ బౌలింగ్‌తో మెరిసినా అతడిపై విమర్శలు రావడం కొత్తగా అనిపిస్తుందన్నాడు. ఇక అఫ్గానిస్తాన్‌తో జరిగిన మ్యాచ్లో విజయ్ శంకర్ క్రీజులో పెద్దగా తడబడలేదని, అనవసర షాట్‌తో అవుటయ్యాడని కోహ్లీ వెనుకేసుకొచ్చాడు. అతడి బ్యాటింగ్‌లో మేనేజ్‌మెంట్‌కు ఎలాంటి లోపాలు కనిపించలేదని, చిన్నచిన్న తప్పులకు రిజర్వ్ బెంచ్‌కు పరిమితం చేయడం సరికాదన్నాడు.