క్రీడాభూమి

లంకకు చివరి ఆశ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెస్టర్ లీ స్ట్రీక్, జూన్ 30: ప్రపంచ కప్ క్రికెట్ చాంపియన్‌షిప్‌లో సెమీస్ చేరే అవకాశాలను దాదాపుగా చేజార్చుకున్న శ్రీలంక, సాంకేతికంగా ఇంకా టోర్నీ నుంచి నిష్క్రమించలేదు. ఇతరత్రా మ్యాచ్‌ల ఫలితాలపై ఆధారపడినప్పటికీ, సోమవారం వెస్టిండీస్‌తో జరిగే మ్యాచ్‌ని దిముత్ కరుణరత్నే నాయకత్వంలోని లంక ఎంతో కీలకంగా భావిస్తున్నది. ఈ మ్యాచ్‌లో నెగ్గి, చివరి గ్రూప్ మ్యా చ్‌లోనూ విజయం సాధిస్తే, లంకకు సెమీస్ చేరే అవకాశాలు కొంతవరకైనా ఉంటాయి. అయితే, మిగతా గ్రూప్ మ్యాచ్‌ల ఫలితాలు కూడా లంక భవిష్యత్తును నిర్దేశిస్తా యి. అదృష్టం ఎలా ఉంటుందో తెలియనప్పటికీ, ఏ ఒక్క అవకాశాన్నీ చేజార్చుకోవద్దన్న పట్టుదలతో లంక బరిలోకి దిగడం ఖాయం. విండీస్ నిష్క్రమణ ఖరారు కావడంతో, ఆ జట్టు ఎలాంటి ఒత్తిడి లేకుండా స్వేచ్ఛగా ఆడనుంది. అదే సమయంలో శ్రీలంక మాత్రం ఒత్తిడి మధ్య ఆడక తప్పదు. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో ఓడిన కారణంగా లంకకు సెమీస్ అవకాశాలు దాదాపుగా తెరపడ్డాయి. ఒకవేళ వెస్టిండీస్ చేతిలోనూ పరాజయాన్ని ఎదుర్కొంటే, అధికారికంగా టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. ఈ జట్టు ఇప్పటివరకూ ఏడు మ్యాచ్‌లు ఆడింది. రెండు విజయాలు సాధించింది. మూడు పరాజయాలను ఎదుర్కొంది. రెండు మ్యాచ్‌లు వర్షం వల్ల రద్దు కావడంతో, పాయింట్లను పంచుకుం ది. మొత్తం ఆరు పాయింట్లు సంపాదించిన లంక సోమవారం నాటి మ్యాచ్‌లో విండీస్‌ను ఓడిస్తే, ఎనిమిది పాయింట్లకు చేరుతుంది. 6వ తేదీన భారత్‌తో జరిగే మ్యాచ్‌ని కూడా తన ఖా తాలో వేసుకుంటే, ఆ జట్టు ఖాతాలో పది పాయింట్లు చేరతా యి. అదే జరిగితే, చివరి మ్యాచ్‌లో పాక్, రెండు మ్యాచ్‌ల్లో బం గ్లాదేశ్ పరాజయాలను ఎదుర్కొంటే తప్ప, లంక నాకౌట్ చేరడానికి మార్గం ఏర్పడదు. అ ప్పటికీ, ఖాయంగా సెమీస్‌లో చోటు దక్కుతుందని చెప్పడానికి వీల్లేదు. ఏదిఏమైనా, ఆశలు సజీవంగా ఉన్నాయని అనుకోవడానికైనా విండీస్‌ను ఓడించడం లంకకు అత్యవసరం.
ఇంత వరకూ ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో కేవలం ఒక విజయాన్ని నమోదు చేసి, ఐదు మ్యాచ్‌ల్లో పరాజయాలను ఎదుర్కొన్న వెస్టిండీస్ ఇప్పటికే టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దుకావడంతో, ఆ జట్టు పాయింట్ల సంఖ్య మూడుకు చేరింది. ఈ మ్యాచ్ ఫలితం వల్ల ఎలాంటి ప్రభావం ఉండదు కాబట్టి, వ్యక్తిగత రికార్డులు, జట్టు కూర్పు ప్రయోగాలు వంటి అంశాలపై విండీస్ దృష్టి కేంద్రీరించనుంది. దక్షిణాఫ్రికా మాదిరిగానే, టోర్నీలో లేకపోయినప్పటికీ, బలమైన జట్టును ఓడించామన్న సంతృప్తి కోసం, శ్రీలంకపై తుది వరకూ పోరాడే అవకాశాలు లేకపోలేదు. కాగితంపై చూస్తే, లంక బలమైన జట్టుగా కనిపిస్తున్నప్పటికీ, విండీస్‌ను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదన్నది మాత్రం వాస్తవం.