క్రీడాభూమి

అనాస్ రికార్డు పరుగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 14: భారత అథ్లెట్ మహమ్మద్ అనాస్ పురుషుల 400 మీటర్ల మీటర్ల పరుగులో కొత్త జాతీయ రికార్డును నెలకొల్పాడు. ఇక్కడికి అందిన సమాచారం ప్రకారం, చెక్ రపబ్లిక్‌లో జరుగుతున్న క్లాండో అథ్లెటిక్స్ మీట్‌లో పోటీపడిన అతను 400 మీటర్ల దూరాన్ని 45.21 సెకన్లలో పూర్తి చేసి, స్వర్ణ పతకం కైవసం చేసుకున్నాడు. అంతేగాక, గత ఏడాది 45.24 సెకన్లతో తాను నెలకొల్పిన రికార్డును తానే అధిగమించాడు. అంతేగాక, ప్రపంచ చాంపియన్‌షిప్స్‌కు అర్హత సంపాదించాడు. ఇలావుంటే, మహిళల 200 మీటర్ల ఈవెంట్‌లో హిమా దాస్ స్వర్ణ పతకాన్ని అందుకుంది. ఆమె లక్ష్యాన్ని 23.43 సెకన్లలో చేరింది. 11 రోజుల వ్యవధిలో ఆమెకిది మూడో స్వర్ణ పతకం.

చిత్రాలు.. మహమ్మద్ అనాస్, హిమా దాస్