క్రీడాభూమి

దరఖాస్తు చేసుకోండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 15: టీమిండియా సపోర్టింగ్ స్ట్ఫా ఎంపికకు భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బీసీసీఐ) సన్నాహాలు ప్రారంభించింది. ఆసక్తికల వారు దరఖాస్తు చేసుకోవాలని ఒక ప్రకటనలో తెలిపింది. చీఫ్ కోచ్ రవి శాస్ర్తీసహా ప్రస్తుతం ఆయా పదవుల్లో ఉన్న వారందరికీ ఈ ప్రకటన వర్తిస్తుంది. కొత్తవారి మాదిరిగానే, పాత కాపులు కూడా మళ్లీ దరఖాస్తు చేసుకోకతప్పదు. టీమిండియా వచ్చేనెల వెస్టిండీస్ పర్యటనకు వెళుతుంది. ఆ టూర్ ముగిసిన వెంటనే, ప్రస్తుత సోర్టింగ్ స్ట్ఫా కాంట్రాక్టు ముగుస్తుంది. నిజానికి వరల్డ్ కప్ చాంపియన్‌షిప్‌తోనే చీఫ్ కోచ్ రవి శాస్ర్తీ, బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగార్, ఫీల్డింగ్ కోచ్ ఆర్. శ్రీ్ధర్ తదితరుల ఒప్పందానికి తెరపడింది. అయితే, విండీస్ టూర్‌ను దృష్టిలో ఉంచుకొని, వారి ఒప్పందాలను బీసీసీఐ మరో 45 రోజులు పొడిగించింది. ఆగస్టు మూడు నుంచి సెప్టెంబర్ మూడు వరకూ విండీస్ టూర్ ఉంటుంది. భారత జట్టు వరల్డ్ కప్ సెమీస్ నుంచి నిష్క్రమించిన తర్వాత ఫిజియో పాట్రిక్ ఫర్హత్, ట్రైనర్ శంకర్ బసు తాము వైదొలగుతున్నట్టు ప్రకటించారు.
కాబట్టి వీరిద్దరి స్థానాల్లో కొత్తవారు రావడం ఖాయమైంది. కోచ్‌సహా మిగతా సపోర్టింగ్ స్ట్ఫా మళ్లీ దఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి, వారిలో అందరు లేదా కొంత మంది మరోసారి కాంట్రాక్టును పొందవచ్చు. లేక కొత్తవారితోనే అన్ని స్థానాలను భర్తీ చేయాలని బీసీసీఐ భావించినా ఆశ్చర్యం లేదు.