క్రీడాభూమి

‘ఇండోనేషియా’ క్వార్టర్స్‌కు సింధు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జకార్తా, జూలై 18: భారత బాడ్మింటన్ స్టార్ పీవీ సింధు ఇక్కడ జరుగుతున్న ఇండోనేషియా ఓపెన్ బాడ్మింటన్ చాంపియన్‌షిప్ మహిళల సిం గిల్స్‌లో క్వార్టర్ ఫైనల్స్ చేరింది. అన్‌సీడెడ్ క్రీ డా కారిణి మియా బిచ్‌ఫెల్డ్ (డెన్మార్క్)ను ఆమె 21- 14, 17-21, 21-11 తేడాతో ఓడించింది. ఐదో సీడ్ గా బరిలోకి దిగిన ఆమె మొదటి సెట్‌లోనే తన ప్రత్యర్థి నుంచి గట్టిపోటీని ఎదుర్కొంది. అయతే ఆ సెట్‌ను తన ఖాతాలో వేసుకుంది. కానీ, రెండో సెట్‌లో బిచ్‌ఫెల్డ్ సర్వశక్తులు ఒడ్డడంతో, ఆ సెట్ ను చేజార్చుకుంది. దీనితో మూడో సెట్ అత్యంత కీలకంగా మారింది. ఆ సెట్‌లో సింధు విజృంభిం చగా, బిచ్‌ఫెల్డ్ ఆత్మరక్షణలో పడిపోయంది. అన్ని విధాలా ఆధిపత్యాన్ని కనబరచిన సింధు మూడో సెట్‌తోపాటు మ్యాచ్‌ని కూడా గెల్చుకొని, క్వార్టర్ ఫైనల్స్‌లో స్థానం సంపాదించింది. కాగా, పురు షుల డబుల్స్ విభాగంలో సాత్విక్‌సాయరాజ్, చి రాగ్ శెట్టి జోడీ 15-21, 14-21 తేడాతో మార్కస్ ఫెనాల్డి గిడియన్, కెవిన్ సంజయ సుకములిజో జోడీ చేతిలో ఓటమిపాలయ్యారు.