క్రీడాభూమి

టీమిండియా కోచ్ నియామకం ఇప్పుడే కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మే 22: టీమిండియాకు కోచ్ నియామకం ఇప్పుడే జరగదని, కనీసం రెండుమూడు నెలల సమయం పడుతుందని భారత మాజీ కెప్టెన్, బెంగాల్ క్రికెట్ సంఘం (సిఎబి) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పష్టం చేశాడు. బిసిసిఐ ప్రత్యేక వార్షిక సమావేశంలో పాల్గొనేందుకు ఇక్కడికి వచ్చిన అతను విలేఖరులతో మాట్లాడుతూ జింబాబ్వే టూర్‌కు టీమిండియా వెళ్లేలోగా కోచ్ నియామకం జరుగుతుందా లేదా అన్నది తాను ఇప్పుడే చెప్పలేనని అన్నాడు. జూలై, ఆగస్టు మాసాల్లో జింబాబ్వేకు భారత జట్టు వెళుతున్న విషయాన్ని సచిన్ తెండూల్కర్, వివిఎస్ లక్ష్మణ్‌తోపాటు బిసిసిఐ సలహా మండలి సభ్యుడిగా ఉన్న గంగూలీ ప్రస్తావిస్తూ, ఈలోగా కొత్త కోచ్ నియామకంపై సాధ్యాసాధ్యాలను తాను చెప్పలేనని అన్నాడు. అయితే, కసరత్తు జరుగుతున్నదని తెలిపాడు.