క్రీడాభూమి

సన్‌రైజర్స్‌పై విజయంతో ప్లే ఆఫ్‌కు నైట్‌రైడర్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, మే 22: కోల్‌కతా నైట్‌రైడర్స్ ఐపిఎల్ ప్లే ఆఫ్‌కు దూసుకెళ్లింది. పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఆదివారం జరిగిన కీలక మ్యాచ్‌లో 22 పరుగుల తేడాతో విజయభేరి మోగించిన నైట్‌రైడర్స్ మొత్తం 16 పాయింట్లతో మూడో స్థానాన్ని ఆక్రమించింది. ప్రత్యర్థి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఈ జట్టు 20 ఓవర్లలో ఆరు వికెట్లకు 171 పరుగులు చేయగా, అనంతరం బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 149 పరుగులు చేయగలిగింది. యూసుఫ్ పఠాన్ అజేయ అర్ధ శతకం నైట్‌రైడర్స్ విజయంలో కీలక భూమిక పోషించగా, సన్‌రైజర్స్ ఓపెనర్ శిఖర్ ధావన్ చేసిన అర్ధ శతకం వృథా అయింది.
నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్‌ను ఆరంభించిన ఓపెనర్లు రాబిన్ ఉతప్ప, కెప్టెన్ గౌతం గంభీర్ తొలి వికెట్‌కు 33 పరుగులు జోడించారు. 17 బంతుల్లో, నాలుగు ఫోర్లతో 25 పరుగులు చేసిన ఉతప్పను కేన్ విలియమ్‌సన్ క్యాచ్ పట్టగా బరీందర్ శరణ్ అవుట్ చేయడంతో నైట్‌రైడర్స్ తొలి వికెట్‌ను కోల్పోయింది. కొలిన్ మున్రో 10 పరుగులకే దీపక్ హూడా బౌలింగ్‌లో వికెట్‌కీపర్ నమన్ ఓఝా క్యాచ్ అందుకోగా వెనుదిరిగాడు. గంభీర్ 15 బంతులు ఎదుర్కొని 16 పరుగులు చేసిన గంభీర్ వికెట్‌ను కూడా దీపక్ హూడా పడగొట్టాడు. మోజెస్ హెన్రిక్స్‌కు క్యాచ్ ఇచ్చి అతను వెనుదిరిగాడు. 57 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయిన నైట్‌రైడర్స్‌ను మనీష్ పాండే, యూసుఫ్ పఠాన్ ఆదుకున్నారు. ఒకవైపు వికెట్ల పతనాన్ని అడ్డుకుంటూనే మరోవైపు నాలుగో వికెట్‌కు 57 పరుగుల భాగస్వామ్యాన్ని అందించిన పాండే 30 బంతుల్లో 48 పరుగులు చేసి భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో కేన్ విలియమ్‌సన్‌కు దొరికాడు. అతని స్కోరులో రెండు ఫోర్లు, మూడు సిక్సర్లు ఉన్నాయి. జాసన్ హోల్డర్ (3), షకీబ్ అల్ హసన్ (7) తక్కువ స్కోర్లకే పెవిలియన్ చేరగా, నైట్‌రైడర్స్ 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేయగా, అప్పటికి సూర్య కుమార్ యాదవ్ (6)తో కలిసి యూసుఫ్ పఠాన్ నాటౌట్‌గా నిలిచాడు. అతను 34 బంతులు ఎదుర్కొని, మూడు ఫోర్లు, రెండు సిక్సర్లతో 52 పరుగులు సాధించాడు. సన్‌రైజర్స్ బౌలర్లలో భువనేశ్వర్, దీపక్ హూడా చెరి రెండు వికెట్లు పడగొట్టారు.
ధావన్ మెరుపు ఇన్నింగ్స్
నైట్‌రైడర్స్‌ను ఓడించడానికి 172 పరుగు చేయాల్సి ఉండగా, శిఖర్ ధావన్ మెరుపు ఇన్నింగ్స్ ఆడితే, కెప్టెన్ డేవిడ్ వార్నర్ 16 బంతుల్లో 18 పరుగులు చేసి, సునీల్ నారైన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. మొదటి వికెట్‌గా వార్నర్ వెనుదిరిగితే, సన్‌రైజర్స్ రెండో వికెట్‌ను ధావన్ రూపంలో కోల్పోయింది. అతను కేవలం 30 బంతులు ఎదుర్కొని, నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 51 పరుగులు చేసి, కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో కొలిన్ మున్రో క్యాచ్ అందుకోగా అవుటయ్యాడు. అతను వెనుదిరిగిన తర్వాత సన్‌రైజర్స్ కోలుకోలేకపోయింది. నమన్ ఓఝా 15, యువరాజ్ సింగ్ 19, కేన్ విలియమ్‌సన్ 7, దీపక్ హూడా 2 చొప్పున పరుగులు చేసి వెనుదిరిగారు. క్రీజ్‌లో దొక్కుకుంటాడనుకున్న మోజెస్ హ్రెనిక్స్ 11 పరుగులకే సునీల్ నారైన్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. భువనేశ్వర్ 5 పరుగులకు అంకిత్ రాజ్‌పుట్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. పరుగుల వేటలో విఫలమైన సన్‌రైజర్స్ 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 149 పరుగులు చేయగలిగింది. అప్పటికి కర్న్ శర్మ 8, బరీందర్ శరణ్ 2 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. నైట్‌రైడర్స్ ‘స్పిన్ మాంత్రికుడు’ సునీల్ నారైన్ 26 పరుగులకు మూడు వికెట్లు పడగొట్టాడు. కుల్దీప్ యాదవ్ 28 పరుగులిచ్చి రెండు వికెట్లు సాధించాడు.

సంక్షిప్త స్కోర్లు

కోల్‌కతా నైట్‌రైడర్స్: 20 ఓవర్లలో 6 వికెట్లకు 171 (రాబిన్ ఉతప్ప 25, గౌతం గంభీర్ 16, మనీష్ పాండే 48, యూసుఫ్ పఠాన్ 52 నాటౌట్, భువనేశ్వర్ కుమార్ 2/31, దీపక్ హూడా 2/16).
సన్‌రైజర్స్ హైదరాబాద్: 20 ఓవర్లలో 8 వికెట్లకు 149 (శిఖర్ ధావన్ 51, డేవిడ్ వార్నర్ 18, యువరాజ్ సింగ్ 19, సునీల్ నారైన్ 3/26, దీపక్ హూడా 2/28).