క్రీడాభూమి

గబ్బర్ ఈజ్ బ్యాక్..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూలై 21: టీమిండియా సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ తిరిగి జట్టులోకి వచ్చాడు. ప్రపంచకప్‌లో చేతి బొటనవేలికి గాయం కావడంతో టోర్నీ మొత్తానికే దూరమైన ధావన్ తిరిగి కోలుకోవడంతో వచ్చే నెల జరిగే వెస్టిండీస్ పర్యటనకు జట్టుతో చేరనున్నాడు. ఆదివారం చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలో కరేబియాన్ పర్యటనకు జట్టును ఎంపిక చేశారు. ధావన్‌కు టీ20, వనే్డల్లో చోటు కల్పించగా, 2018 ఐపీఎల్ (ఇండియన్ ప్రీమియర్ లీగ్)లో భుజం నొప్పితో గాయ పడిన వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహాతో పాటు స్పెషలిస్ట్ బ్యాట్స్‌మన్ చతేశ్వర్ పుజారా, ఆంధ్ర ఆటగాడు హనుమ విహారికి చోటు కల్పిం చారు. ఇక టీ20ల్లో శ్రేయాస్ అయ్యర్, మనీష్ పాండే, కృనాల్ పాండ్య , వాషింగ్టన్ సుందర్ రాహుల్, దీపక్ చాహర్‌లతో పాటు ఖలీల్ అహమ్మద్, నవదీస్ సైనీ చోటు దక్కించుకున్నారు.
సీనియర్లకు చోటు..
గత కొద్దిరోజులుగా జాతీయ జట్టుకు దూరమైన సీనియర్ ఆటగాళ్లు రవిచంద్రన్ అశ్విన్, ఉమేశ్ యాదవ్, ఇషాంత్ శర్మలకు సెలక్టర్లు టెస్ట్ జట్టులో చోటు కల్పించారు. మరోవైపు ప్రపంచకప్ వంటి మెగా టోర్నీలో రాణించిన రవీంద్ర జడేజాను మూడు ఫార్మట్లకు ఎంపిక చేయడం విశేషం.
పాండ్య, కార్తీక్, బుమ్రాకు విశ్రాంతి
వరుసగా క్రికెట్ ఆడుతున్న ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య, పేసర్ జస్ప్రీత్ బుమ్రాలతో పాటు ప్రపంచకప్‌లో దారుణంగా విఫలమైన దినేష్ కార్తీక్‌లకు సెలక్టర్లు విశ్రాంతినిచ్చారు. అయితే కేదార్ జాదవ్‌కు మాత్రం వనే్డల్లో అవకాశం కల్పించారు.
టీ20 జట్టు: విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టె న్), శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్, మనీష్ పాండే, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), కృనాల్ పాండ్య, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, రాహుల్ చాహర్, భువనేశ్వర్ కుమార్, ఖలీల్ అహమ్మద్, దీపక్ చాహర్, నవదీప్ సైనీ.
వనే్డ జట్టు: విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్, మనీష్ పాండే, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, యుజువేంద్ర చాహల్, కేదార్ జాదవ్, మహమ్మద్ షమీ, భువనేశ్వర్ కుమార్, ఖలీల్ అహమ్మద్.
టెస్ట్ జట్టు: విరాట్ కోహ్లీ (కెప్టెన్), అజింక్యా రహానె (వైస్ కెప్టెన్), మయంక్ అగర్వాల్, కేఎల్ రాహుల్, చతేశ్వర్ పుజారా, హనుమ విహారి, రోహిత్ శర్మ, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, ఇషాంత్ శర్మ, మహమ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, ఉమేశ్ యాదవ్.
చిత్రం... ముంబయిలో ఆదివారం జరిగిన సెలక్షన్ కమిటీ సమావేశానికి హాజరై బయటకు వస్తున్న
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ