క్రీడాభూమి

టీమిండియా తాత్కాలిక కోచ్‌గా బంగర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మే 27: టీమిండియాకు గత 18 నెలల నుంచి సహాయ కోచ్‌గా సేవలు అందిస్తున్న మాజీ ఆల్‌రౌండర్ సంజయ్ బంగర్ త్వరలో జింబాబ్వేలో జరుగనున్న పరిమిత ఓవర్ల సిరీస్‌లో భారత జట్టుకు తాత్కాలిక కోచ్‌గా నియమితుడయ్యాడు. జూన్ 11వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ఈ సిరీస్‌లో భారత జట్టుకు అభయ్ శర్మ (రైల్వేస్ జట్టులో బంగర్ సహచరుడు) ఫీల్డింగ్ కోచ్‌గానూ, ఆంధ్రా క్రికెట్ సంఘానికి చెందిన కె.రమేష్ మేనేజర్‌గానూ వ్యవహరిస్తారని బిసిసిఐ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. అయితే ఇటీవల ప్రపంచ కప్ ట్వంటీ-20 టోర్నమెంట్ పూర్తయిన తర్వాత పదవీ కాలం ముగిసిన నలుగురు కోచింగ్ సిబ్బందిలో కేవలం ఒక్కరని (బంగర్‌ను) మాత్రమే తిరిగి ఎందుకు నియమించారన్న విషయాన్ని బిసిసిఐ వెల్లడించలేదు.