క్రీడాభూమి

హోటల్ వ్యాపారంలో రొనాల్డో పెట్టుబడులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లిస్బన్, డిసెంబర్ 18: రియల్ మాడ్రిడ్ సూపర్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో తన పేరుమీద హోటళ్లను ప్రారంభించేందుకు భారీ పెట్టుబడులతో సిద్ధమవుతున్నాడు. తన జన్మస్థలమైన పోర్చుగల్‌తోపాటు మాడ్రిడ్, న్యూయార్క్ నగరాల్లోనూ సిఆర్-7 పేరుతో హోటళ్లను తెరిచేందుకు అతను పెస్టానా హోటల్ గ్రూప్‌తో ఒప్పందం చేసుకున్నాడు. 40 మిలియన్ డాలర్లను వెచ్చించి, హోటల్ వ్యాపారంలోకి రావాలన్నది అతని ఆలోచన. తనకు ఫుట్‌బాల్ అంటే ప్రాణమని, అయితే, హోటల్ వ్యాపారం చేయాలన్న కోరిక కూడా తనకు చాలాకాలంగా ఉందని ఈ 30 ఏళ్ల సాకర్ హీరో అన్నాడు. ఇంత పెద్ద ప్రాజెక్టును నిర్వహించడం తన ఒక్కడి వల్ల కాదని, అందుకే పెస్టానా గ్రూప్ సహకారం తీసుకుంటానని తెలిపాడు. పెట్టుబడుల్లో తన వాటా 50 శాతం ఉంటుందన్నాడు.