క్రీడాభూమి

సాధించాల్సింది ఎంతో ఉంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, సెప్టెంబర్ 12: తాను సాధించాల్సింది ఎంతో ఉందని స్టార్ రైడర్ ప్రదీప్ నర్వాల్ వ్యాఖ్యానించాడు. ప్రో కబడ్డీ లీగ్ (పీకేఎల్)లో 1,000 పాయింట్ల మైలురాయిని చేరిన తొలి ఆటగాడిగా రికార్డు నెలకొల్పిన ఈ హర్యానా వీరుడు పాట్నా పైరేట్స్ తరఫున, 2014లో జరిగిన తొలి సీజన్‌లో పాల్గొన్నప్పుడు టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఆతర్వాత నిలకడగా రాణిస్తూ, పలు రికార్డులను సృష్టించాడు. సీజన్-5లో అతను హర్యానా స్టీలర్స్ తరఫున ఇంత వరకూ 369 పాయింట్లు సాధించాడు. రెండో స్థానంలో ఉన్న రైడర్ కంటే ప్రదీప్ 150 పాయింట్లు ముందున్నాడంటే, పీకేఎల్‌లో అతను ఏ విధంగా రాణిస్తున్నాడో ఊహించుకోవచ్చు. ఈ టోర్నమెంట్‌లోకి అడుగుపెట్టిన మొదటి రోజు నుంచి ఇప్పటి వరకు కూడా తన ప్రయాణం ఎంతో సంతృప్తికరంగా ఉందని గురువారం పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చెప్పాడు. ఈ స్థానానికి చేరుకోవడానికి తాను ఎంతో కష్టపడ్డానని అన్నాడు. కబడ్డీ క్రీడాకారుడిగా ఇంకా ఎంతో ముందుకు వెళ్లాల్సి ఉందని తెలిపాడు. ప్రస్తుత సీజన్‌లో 1,000 పాయింట్ల మైలురాయిని అధిగమించినందుకు తనకు ఎంతో ఆనందంగా ఉందని ప్రదీప్ చెప్పాడు. ఈ రికార్డు తన బాధ్యతను మరింతగా పెంచిందని వ్యాఖ్యానించాడు. అభిమానుల అంచనాలకు తగినట్టు రాణించాల్సి ఉంటుందన్నాడు. అందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని తెలిపాడు. పీకేఎల్‌కు తాను ఎంతో రుణపడి ఉంటానని అన్నాడు.