క్రీడాభూమి

వర్షంతో మ్యాచ్‌లు రద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పారిస్: ఫ్రెంచ్ ఓపెన్‌ను వర్షం వెంటాడింది. దాదాపుగా ప్రతిరోజూ వర్షం కారణంగా పలు మ్యాచ్‌లకు అంతరాయం ఏర్పడుతునే ఉంది. అయితే, సోమవారం జరగాల్సిన మ్యాచ్‌లన్నీ వర్షం వల్ల రద్దు కావడం విశేషం. 2000లో చివరిసారి ఈ విధంగా ఒక రోజులో ఒక్క మ్యాచ్ కూడా జరగలేదు. 16 ఏళ్ల తర్వాత మొదటిసారి మరోసారి అదే పరిస్థితి పునరావృతమైంది. ఇలావుంటే, వర్షం వల్ల మ్యాచ్‌లను వాయిదా వేస్తున్న నిర్వాహకులు, సకాలంలో టోర్నీ పూర్తవుతుందా లేదా అని భయపడుతున్నారు. వర్షం తగ్గిన వెంటనే విరామం లేకుండా మ్యాచ్‌లను పూర్తి చేయించే ప్రయత్నంలో పడ్డారు. భారీ వర్షం కురిసినప్పుడు పైకప్పును మూసివేసే విధంగా కోర్టులను తీర్చిదిద్దాలన్న డిమాండ్ మరోసారి తెరపైకి వచ్చింది.