క్రీడాభూమి

అఫ్గాన్ హెడ్ కోచ్‌గా క్లూసెనర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాబుల్, సెప్టెంబర్ 27: దక్షిణాఫ్రి కా మాజీ ఆల్ రౌండర్ లాన్స్ క్లూసెన ర్‌ను ప్రధాన కోచ్‌గా నియమిస్తున్నట్లు అఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డు (ఏసీబీ) శుక్రవారం పేర్కొంది. అంతకుముం దు జట్టుకు కోచ్‌గా పనిచేసిన పిల్ సి మ్మన్స్ (వెస్టిండీస్) పదవి కాలం 2019 ప్రపంచకప్‌తోనే ముగిసింది. కోచ్ ప దవి కోసం మొత్తం 50 దరఖాస్తులు రాగా, క్లూసెనర్‌ను ఎంపిక చేసినట్లు పేర్కొన్నా ఏసీబీ వెల్లడించింది. నవం బర్‌లో వెస్టిండీస్‌తో జరిగే సిరీస్‌తో క్లూసెనర్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టను న్నాడు. అయతే ప్రస్తుతం భారత్‌తో జరిగిన టీ20 సిరీస్‌కు క్రికెట్ దక్షిణా ఫ్రికా క్లూసెనర్‌ను అసిస్టెంట్ బ్యాటిం గ్ కోచ్‌గా నియమించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా క్లూసెనర్ మాట్లాడుతూ ప్రపంచం లోని అత్యు త్తమ ఆటగాళ్లతో పనిచేయడానికి అవ కాశం లభించినందుకు ఆనందంగా ఉందన్నారు. కాగా, 48 ఏళ్ల క్లూసెనర్ తన కెరీర్‌లో 49 టెస్టులు, 171 అంతర్జాతీయ వనే్డలు ఆడాడు. గతం లో ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ముంబై ఇండియన్స్ జట్టుకు బౌలింగ్ కోచ్‌గా, దక్షిణాఫ్రికా జాతీయ అకాడ మీకి కన్సల్టెంట్‌గా, జాతీయ జట్టుకు బ్యాటింగ్ కోచ్‌గా పనిచేశాడు. అలా గే దక్షిణాఫ్రికా డొమెస్టిక్ జట్టు డాల్ఫి న్స్ ఫ్రాంచైజీకి హెడ్ కోచ్‌గా, జింబా బ్వే జట్టుకు బ్యాటింగ్ కోచ్‌గా పనిచే సిన అనుభం ఉంది.