క్రీడాభూమి

ఆంధ్రా జట్టు ఓటమి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆలూర్, అక్టోబర్ 12: దేశవాళి ప్రతిష్టాత్మక విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా శనివారం జార్ఖండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆంధ్రా జట్టు ఓడిపోయంది. ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆంధ్రా బ్యాట్స్‌మెన్లలో క్రాంతి కుమార్ (72), ప్రసన్న కుమార్ (56), కెప్టెన్, వికెట్ కీపర్ రికీ భూయ్ (59), కరణ్ షిండే (32) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లను కోల్పోయ 265 పరుగులు చేసింది. జార్ఖండ్ బౌలర్లలో వరుణ్ ఆరోన్ 2 వికెట్లు తీయగా, ఉత్కర్ష్ సింగ్, వివేకానంద్ తివారీ, రాహుల్ శుక్లా, షబాజ్ నదీమ్‌లు తలో వికెట్ తీశారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన జార్ఖండ్ మరో రెండు బంతులు మిగిలి ఉండగానే 7వికెట్లు కోల్పో య విజయం సాధించింది. విరాట్ సింగ్ (74, నాటౌట్)తో పాటు సౌరభ్ తివారీ (56) అర్ధ సెంచరీలతో చేలరేగగా, ఉత్కర్ష్ సింగ్ (49), అనుకుల్ రాయ్ (33)లు రాణించారు.