క్రీడాభూమి

క్యూ స్పోర్ట్స్‌కు పెరుగుతున్న ఆదరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 2: క్యూ స్పోర్ట్స్ పట్ల ఆదరణ పెరుగుతున్నదని, ఇది శుభ పరిణామమని ప్రపంచ బిలియర్డ్స్ చాంపియన్ పంకజ్ అద్వానీ అన్నాడు. వివిధ అంతర్జాతీయ బిలియర్డ్స్, స్నూకర్ చాంపియన్‌షిప్స్‌లో భారత్‌కు ప్రాతినిథ్యం వహించే అవకాశం కోసం మాదాపూర్‌లోని బాల్క్‌లైన్ క్యూ స్పోర్ట్స్ అకాడెమీలో గురువారం ప్రారంభమైన ట్రయల్స్‌కు హాజరైన ఆయన మాట్లాడుతూ ఇటీవల కాలంలో వౌలిక సదుపాయాలు పెరుగుతున్నాయని అన్నాడు. అయితే, క్యూ స్పోర్ట్స్ కూడా మిగతా క్రీడల మాదిరిగానే అందరికీ అందుబాటులోకి రావాల్సిన అవసరం ఉందన్నాడు. ఈ కార్యక్రమంలో అఖిల భారత బిలియర్డ్స్, స్నూకర్ సంఘం కెప్టెన్ పివికె మోహన్, ఆంధ్ర బిలియర్డ్స్ సంఘం సంయుక్త కార్యదర్శి అప్పారావు తదితరులు పాల్గొన్నారు.