క్రీడాభూమి

భారత్ పర్యటనను దెబ్బతీయాలనే కుట్రతోనే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఢాకా, అక్టోబర్ 28: భారత్ పర్యటనను దెబ్బతీయాలనే కుట్రతోనే తమ ఆటగాళ్లు మెరుపు సమ్మెకు దిగారని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు నజ్ముల్ హసన్ పేర్కొ న్నాడు. అంతేకాకుం డా దీనిపై తనకు పూర్తి సమాచారం అందినట్లు చెప్పాడు. వారు సమ్మెకు దిగడాన్ని ఇప్పటికీ నేను నమ్మలేక పోతున్నాను. వారితో ప్రతిరోజు మాట్లాడే వాడిని. నాకు ఎలాంటి సమాచారం అందివ్వ కుండా హఠాత్తుగా సమ్మెకుదిగారు. చర్చల్లో వారి డిమాండ్లను అంగీకరించడం నేను చేసిన తప్పుగా భావిస్తున్నా. నేను అలా చేసి ఉండకూడదు. సమ్మె విరమించిన తర్వాత చర్చలు జరుపుతామని ఆటగాళ్లకి చెప్పా. డి మాండ్ల గురించి ఇతర బోర్డులతోనూ చ ర్చించాలని వారికి విజ్ఞప్తి చేశా. కానీ మీడి యా కూడా మాపై ఒత్తిడి తెచ్చిందని అని వివరించాడు. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ పాత పద్ధతిలోనే నిర్వహించడం, ఫస్ట్‌క్లాస్ క్రికెట్, మైదాన సిబ్బందికి వేతనాలు పెంచ డం వంటి వాటితో పాటు మరి కొన్ని డిమాం డ్లతో బంగ్లాదేశ్ క్రికెటర్లు ఇటీవల సమ్మెకు దిగిన విషయం తెలిసిందే. వారి డి మాండ్లను నెరవేరుస్తామని బీసీబీ (బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు) హామీ ఇవ్వడంతో వారు సమ్మె ను విరమించారు. నవంబర్ 3 నుంచి బంగ్లాదేశ్ భారత్ పర్య టనలో మూ డు టీ20లు, రెండు టెస్టులు ఆడనుంది.
షకీబ్ పై చర్యల్లేవ్..
బంగ్లాదేశ్ క్రికెటర్ షకీబుల్ హసన్‌కు ఊరట లభించింది. ఇటీవల బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) నియమ నిబంధనల్ని ఉల్లంఘించిన షకిబుల్ స్థానిక టెలికాం సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిం చాడు. ఇది బోర్డు నియమావళిని అతిక్రమిం చినట్లు కావడంతో షకిబుల్‌పై చర్యలు తీసుకోవాలని బీసీబీ భావిం చింది. ఈ క్ర మంలోనే బీసీబీ పంపిన షోకాజ్ నోటీసును వెనక్కు తీసుకుం ది. దీనిపై బీసీ బీ చీఫ్ నజ్ము ల్ హసన్ మాట్లాడుతూ ఇది బోర్డు అంత ర్గత వ్యవహారం. దీనికి ఇక్కడితో ముగింపు పలకాలని అనుకుంటున్నాం. అతడిపై చర్య లు తీసుకోవాలనుకోవడం లేదు. అయతే జాతీయ కాంట్రాక్టులో ఉన్న ఆటగాడు ఆ సంస్థతో ఎందుకు ఒప్పందం చేసుకున్నాడు అనే దానిపై వివరణ ఇవ్వాల్సి ఉందని పేర్కొ న్నాడు. అయతే ఇంతకుముందు బీసీబీ షకిబుల్‌తో పాటు సదరు కంపెనీ నుంచి నష్ట పరిహారం డిమాండ్ చేస్తామని పేర్కొ న్న విషయం తెలిసిందే.
*చిత్రం... బీసీబీ చీఫ్ నజ్ముల్ హసన్