క్రీడాభూమి

బంగ్లాకు మంచి అవకాశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయ, అక్టోబర్ 31: వరుస విజయాలతో దూసుకుపోతున్న భారత్‌ను ఓడించేందుకు బంగ్లాదేశ్‌కు ఇది మంచి అవకాశమని మాజీ ఆటగాడు వీవీఎస్ లక్ష్మణ్ పేర్కొన్నాడు. ఈ నెల 3 నుంచి ప్రారంభం కానున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో పర్యాటక జట్టుకు భారత్‌ను సొంత గడ్డపై ఓడించే అవకాశం లభించిందన్నాడు. అయతే బం గ్లా క్రికెటర్లు ఇటీవలి కాలంలో అద్భుత ప్రదర్శన చేస్తున్నారని, భారత్‌తో జరిగే సిరీస్‌లో అన్ని విభాగాల్లో రాణించాల్సి ఉంటుందని సూచించాడు. ప్రధానంగా బంగ్లా బ్యాటింగ్‌లో బలంగా ఉందని, ఆశించిన స్థాయలో రాణిస్తే ఆతిథ్య జట్టుకు గట్టి పోటీనే ఎదురు కానుందన్నాడు. బౌలింగ్‌లో మా త్రం ఒక్క ముస్తాఫిజుర్ రహమన్ మాత్రమే ఫాం లో ఉండడం పర్యాటకు జట్టుకు ఆందోళన కలిగిం చే అంశమని పేర్కొన్నాడు. స్పిన్ విభాగం కూడా బలంగా లేదని, దీంతో ముస్తాఫిజుర్‌పై భారం పడే అవకాశం ఉందన్నాడు. మరోవైపు టీమిండియా సైతం రెగ్యూలర్ కెప్టెన్ విరాట్ కోహ్లీ లేకుండా బరి లోకి దిగుతుందని, మిడిలార్డర్‌లోనూ అనుభం లేని ఆటగాళ్లతో కనిపిస్తుందన్నాడు. భారత్ విజ యాల్లో ముఖ్య భూమిక పోషించడానికి యువ క్రికెటర్లు సిద్ధం కావాలని సూచించాడు. ప్రస్తుతం జరిగే టీ20 సిరీస్‌లో వాషింగ్ట న్ సుందర్, యుజువేంద్ర చాహల్ భారత బౌలింగ్ విభాగానికి కీలకం కానున్నారని లక్ష్మణ్ జోస్యం చెప్పాడు.
*చిత్రం... నెట్ ప్రాక్టీస్‌లో బంగ్లాదేశ్ ఆటగాళ్లు