క్రీడాభూమి

హాంకాంగ్ ఓపెన్ నుంచి సైనా, సమీర్ ఔట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హాంకాంగ్, నవంబర్ 13: భారత బాడ్మింటన్ స్టార్లు సైనా నెహ్వాల్, సమీర్ వర్మ ఇక్కడ జరుగుతున్న హాంకాంగ్ ఓపెన్ టోర్నమెంట్ తొలి రౌండ్ నుంచే నిష్క్రమించారు. ఈ ఏడాది జనవరిలో ఇండోనేషియా మాస్టర్స్ టోర్నమెంట్‌ను తన ఖాతాలో వేసుకున్న సైనా మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో అనూహ్యంగా చైనా క్రీడాకారిణి కాయ్ యాన్ యాన్ చేతిలో 13-21, 20-22 తేడాతో పరాజయాన్ని చవిచూసింది. గత వారం జరిగిన చైనా ఓపెన్‌లో కాయ్ చేతిలో పరాజయాన్ని చవిచూసిన సైనా మరోసారి ఆమెకు దీటైన సమాధానం ఇవ్వలేక పరాజయాన్ని చవిచూసింది. కాగా, పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‌లో 16వ సీడ్ సమీర్‌ను చైనీస్ తైపీకి చెందిన వాంగ్ జు వెయ్ 21-11, 13-21, 21-8 తేడాతో ఓడించాడు. సమీర్‌కు ఇటీవలి టోర్నీల్లో వరుసగా ఇది మూడవ తొలి రౌండ్ పరాజయం. కాగా, హైదరాబాదీ పీవీ సింధు తొలి రౌండ్‌లో ఎలాంటి ఇబ్బంది లేకుండా అధిగమించింది. ప్రపంచ 19వ ర్యాంక్ క్రీడాకారిణి కిమ్ గా ఇన్ (కొరియా)ను 21-19, 21-16 తేడాతో చిత్తు చేసింది. ఈ మ్యాచ్ కేవలం 36 నిమిషాల్లో ముగియడం గమనార్హం.