క్రీడాభూమి

కోల్‌కతా 25కె రన్ సుధా సింగ్‌కు టైటిల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, డిసెంబర్ 20: టాటా స్టుల్ కోల్‌కతా 25కె రన్ మహిళల విభాగంలో సుధా సింగ్ టైటిల్ కైవసం చేసుకుంది. వచ్చే ఏడాది రియో డి జెనీరియోలో జరిగే ఒలింపిక్స్‌కు అర్హత సంపాదించిన ఆమె ఈ రన్‌ను ప్రాక్టీస్ ఈవెంట్‌గా పూర్తి చేసింది. లక్ష్యాన్ని ఒక గంట, 27.31 నిమిషాల్లో చేరుకున్న సుధ విజేతగా నిలవగా, చివరి క్షణం వరకూ ఆమెకు గట్టిపోటీనిచ్చిన లలితా బాబర్ ఒక గంట, 27.47 నిమిషాలతో ద్వితీయ స్థానాన్ని ఆక్రమించింది. ఒపి జైష ఒక గంట, 28.05 నిమిషాలతో తృతీయ స్థానంతో సంతృప్తి చెందింది. కాగా, పురుషుల విభాగంలో ఇలామ్ సింగ్‌కు టైటిల్ లభించింది. శ్రీను బగతా నుంచి ఎదురైన పోటీని తట్టుకున్న అతను ఒక గంట, 20.14 నిమిషాల్లో లక్ష్యాన్ని చేరాడు. శ్రీను 0.02 సెకన్లు ఆలస్యంగా లక్ష్యాన్ని చేరుకొని రెండో స్థానంలో నిలిచాడు. సంతోష్ సింగ్ (ఒక గంట, 20.23 నిమిషాలు) మూడో స్థానాన్ని ఆక్రమించాడు.

హుసెనొవ్ వ్యాఖ్యలు
పట్టుదలను పెంచాయి
భారత బాక్సర్ విజేందర్ సింగ్
మాంచెస్టర్, డిసెంబర్ 20: ఫైట్‌కు ముందు బల్గేరియా బాక్సర్ సమెట్ హుసెనొవ్ చేసిన వ్యాఖ్యలే తనలో పట్టుదలను పెంచాయని భారత స్టార్ బాక్సర్ విజేందర్ సింగ్ అన్నాడు. విజేందర్‌ను నాకౌట్ చేస్తానని, ఆ ఫలితం తన వల్ల వస్తున్నందుకు భారతీయులంతా క్షమించాలని హుసెనొవ్ ఫైట్‌కు ముందు ఒక ఇంటర్వ్యూలో అన్నాడు. ఆరు రౌండ్ల ఈ బౌట్‌లో ఒకటిరెండు రౌండ్లలోనే విజేందర్‌ను మట్టికరిపిస్తానని అన్నాడు. అయితే, హుసునొవ్‌ను సునాయాసంగా ఓడించిన విజేందర్ విజయాల హ్యాట్రిక్‌ను నమోదు చేశాడు. ప్రొఫెషనల్ బాక్సర్‌గా మారిన తర్వాత అతను తొలి ఫైట్‌లో సోనీ వైటింగ్‌ను ఓడించాడు. రెండో ఫైట్‌లో డీన్ గిలెన్‌ను నాకౌట్ చేశాడు. తాజాగా మూడోరౌండ్‌లో హుసెనొవ్‌ను కూడా నాకౌట్ చేయడం ద్వారా విజయాల హ్యాట్రిక్‌ను నమోదు చేశాడు. పట్టుదలతో శ్రమిస్తున్నానని అందుకే సానుకూల ఫలితాలను పొందగలుగుతున్నానని విజేందర్ అన్నాడు. లీ బియర్డ్, హరూన్ హెడ్లే ట్రైనర్లుగా లభించడం తన అదృష్టమన్నాడు.

ఐపిటిఎల్ చాంప్ స్లామర్స్
సింగపూర్, డిసెంబర్ 20: సింగపూర్ స్లామర్స్ జట్టు ఇంటర్నేషనల్ ప్రీమియర్ టెన్నిస్ లీగ్ (ఐపిటిఎల్) చాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకుంది. హాట్ ఫేవరిట్‌గా బరిలోకి దిగిన ఇండియన్ ఏసెస్‌ను ఈ జట్టు 26-21 తేడాతో ఓడించి, మిలియన్ డాలర్ల ప్రైజ్‌మనీని సంపాదించుకుంది. ఈ టోర్నీలో కేవలం మూడు పరాజయాలను మాత్రమే ఎదుర్కొని, ఫైనల్‌లో విజేతగా నిలుస్తుందనుకున్న ఏసెస్ జట్టుకు ఐదు లక్షల డాలర్లు లభించాయి.