క్రీడాభూమి

టైటిల్ వేటలో మెస్సీ సేన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లాస్ ఏంజిలిస్, జూన్ 5: కోపా అమెరికా సాకర్ చాంపియన్‌షిప్ టైటిల్‌పై అర్జెంటీనా జట్టు కనే్నసింది. చిలీతో సోమవారం జరిగే మ్యాచ్‌తో టైటిల్ వేటను అర్జెంటీనా మొదలుపెట్టనుంది. వంద వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈసారి కోపా అమెరికా ప్రాధాన్యతను సంతరించకుంది. గత 23 సంవత్సరాలుగా ఈ టోర్నీలో టైటిల్ సాధించేందుకు అర్జెంటీనా చేస్తున్న ప్రయత్నాలు విఫలమయ్యాయి. ప్రపంచ ఫుట్‌బాల్ రంగంలో తిరుగులేని ఆధిపత్యాన్ని చెలాయిస్తున్న సూపర్ స్టార్ లియోనెల్ మెస్సీ అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తున్న నేపథ్యంలో ఈసారి టైటిల్‌పై అర్జెంటీనా అభిమానులు ఆశలు పెంచుకున్నారు. వారి ఆశలన్నీ మెస్సీపైనే ఉన్నాయి. వంద సంవత్సరాల క్రితం, అర్జెంటీనాలో జరిగిన మొదటి కోపా అమెరికా టోర్నమెంట్‌లో దక్షిణ అమెరికాకు చెందిన నాలుగు జట్లు తలపడ్డాయి. ఉరుగ్వే తొలి టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఇప్పుడు అదే టోర్నీ 16 జట్లతో జరుగుతున్నది. స్వర్ణోత్సవాన్ని జరుపుకొంటున్న సందర్భంలో ఈసారి టైటిల్‌ను సాధించాలన్న పట్టుదల అన్ని జట్లలోనూ కనిపిస్తున్నది. అయితే, మెస్సీ బృందానికి టైటిల్ సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది. డిఫెండింగ్ చాంపియన్ చిలీ, బ్రెజిల్, కొలంబియా, అమెరికా జట్లు కూడా రేసులో ఉన్నాయి. శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న ఈటోర్నీని ‘కోపా అమెరికా సెంటినారియో’గా పిలుస్తున్నారు. ఇటీవల కాలంలో వెల్లువెత్తిన అవినీతి ఆరోపణలు, ముడుపుల వ్యవహారాలు అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య ‘్ఫఫా’ ప్రతిష్టను దారుణంగా దెబ్బతీసింది. పరువును నిలబెట్టుకోవడంతోపాటు, అభిమానుల నమ్మకాన్ని తిరిగి పొందడానికి కృషి చేస్తున్న ఫిఫా ఎలాంటి అవకతవకలకు తావులేకుండా టోర్నీ నిర్వాహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.
కాగా, స్పెయిన్‌లో ఆదాయం ఎగవేత కేసును ఎదుర్కొంటున్న మెస్సీ విచారణ కోసం కోర్టుకు హాజరుకావాల్సి ఉండింది. అయితే, అతను హాజరుకాకుండా తన తండ్రిని కోర్టుకు పంపాడు. తన ఆర్థిక లావాదేవీలన్నీ ఆయన చూసుకుంటున్నాడని వివరణ కూడా ఇచ్చాడు. ప్రస్తుతం కోపా అమెరికా తదితర టోర్నీల్లో ఆడాల్సి ఉన్నందున కోర్టుకు హాజరుకాకుండా, తన ప్రతినిధిని పంపేందుకు అనుమతినివ్వాల్సిందిగా విజ్ఞప్తి చేసినట్టు చెప్పాడు. వ్యక్తిగత అంశాలను పక్కకుపెట్టి, అర్జెంటీనాకు టైటిల్ అందించడమే అతను లక్ష్యంగా ఎంచుకున్నాడు. ఆ యత్నంలో సఫలమవుతాడో లేదో చూడాలి.
బ్రెజిల్, ఈక్వెడార్ మ్యాచ్ డ్రా
బ్రెజిల్, ఈక్వెడార్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఇరు జట్లు మితిమీరిన రక్షణాత్మక విధానాన్ని అనుసరించడంతో ఒక్క గోల్ కూడా నమోదు కాలేదు. కాగా, హైతీపై పెరూ 1-0 తేడాతో గెలిచింది. కీలకమైన ఈ గోల్‌ను మ్యాచ్ 61వ నిమిషంలో పౌలో గెరీరియో సాధించి, పెరూను విజయపథంలో నడిపాడు.