క్రీడాభూమి

జొకోవిచ్‌కు ‘ఫ్రెంచ్’ కిరీటం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పారిస్, జూన్ 5: ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్‌ను కైవసం చేసుకోవాలన్న ప్రపంచ నంబర్ వన్ నొవాక్ జొకోవిచ్ కల నెరవేరింది. గతంలో 11 పర్యాయాలు ఫ్రెంచ్ ఓపెన్‌లో టైటిల్ కోసం విఫలయత్నం చేసిన జొకోవిచ్ పనె్నండో ప్రయత్నంలో సఫలమయ్యాడు. బ్రిటిష్ ఆటగాడు, రెండో ప్రపంచ రెండో ర్యాంకర్ ఆండీ ముర్రేను ఆదివారం జరిగిన ఫైనల్‌లో 3-6, 6-1, 6-2, 6-4 తేడాతో ఓడించి, కెరీర్‌లో 12వ టైటిల్‌ను సాధించాడు. ఇప్పటికే వింబుల్డన్, యుఎస్ ఓపెన్, ఆస్ట్రేలియా ఓపెన్ టోర్నీల్లో టైటిళ్లను కైవసం చేసుకున్న అతను ఇప్పుడు ఈ టోర్నీలో కూడా విజేత నిలవడం ద్వారా కెరీర్ గ్రాండ్ శ్లామ్ పూర్తి చేసిన ఎనిమిదో ఆటగాడిగా రికార్డులకు ఎక్కాడు. 2012లో మొదటిసారి జొకోవిచ్ ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ చేరాడు. తిరిగి 2014, 2015 సంవత్సరాల్లో ఫైనల్‌లో అడుగుపెట్టాడు. వరుసగా మూడోసారి, మొత్తం నాలుగోసారి రొలాండ్ గారోస్‌లో టైటిల్ పోరుకు సిద్ధమయ్యే నేపథ్యంలో అతను మొదటి రౌండ్‌లో లూ యెన్ సన్‌ను ఓడించాడు. రెండో రౌండ్‌లో స్టీవ్ డార్సిస్, మూడో రౌండ్‌లో ఎలిజా బెనె్డన్, ప్రీ క్వార్టర్స్‌లో రాబర్టో బటిస్టా అగట్‌లపై విజయాలను నమోదు చేసి క్వార్టర్స్ చేరాడు. అనంతరం థామస్ బెర్డిచ్‌పై గెలిచి సెమీస్‌లోకి అడుగుపెట్టాడు. ఈసారి ఫ్రెంచ్ ఓపెన్‌లో ‘జెయింట్ కిల్లర్’గా పేరుతెచ్చుకున్న డామినిక్ థియెమ్‌పై విజయభేరి మోగించి ‘ఫైనల్స్ హ్యాట్రిక్’ సాధించాడు. ఈసారి ఫ్రెంచ్ ఓపెన్‌లోకి అడుగుపెట్టే సమయానికి అతని ఖాతాలో 11 గ్రాండ్ శ్లామ్ టైటిళ్లు ఉన్నాయి. వీటిలో ఆరు ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో సాధించనవే. అతను 2008, 2011, 2012, 2013, 2015 సంవత్సరాల్లో విజేతగా నిలిచాడు. ఈఏడాది కూడా టైటిల్ నిలబెట్టుకున్నాడు. వింబుల్డన్‌ను 2011, 2014, 2015 సంవత్సరాల్లో కైవసం చేసుకున్న అతను 2011లో మొదటిసారి, 2015లో రెండోసారి యుఎస్ ఓపెన్‌ను సొంతం చేసుకున్నాడు. గ్రాండ్ శ్లామ్స్‌లో ఎంతో అనుభవం ఉన్నప్పటికీ ఫ్రెంచ్ ఓపెన్‌ను సాధించలేకపోయానన్న ఆవేదన అతనిలో స్పష్టంగా కనిపించేది. ఎలాగైనా ఈసారి టైటిల్ అందుకోవాలన్న పట్టుదలతోనే అతను బరిలోకి దిగాడు. అందరూ ఊహించిన విధంగానే ఫైనల్ చేరాడు. రొలాండ్ గారోస్‌లో జరిగే ఫైనల్ తనకు అచ్చిరావడం లేదన్న ఒత్తిడిని అధిగమించిన జొకోవిచ్ పట్టుదలతో ముర్రేపై దాడికి దిగాడు. అనుకున్నది సాధించాడు. ఫ్రెంచ్ ఓపెన్ ట్రోఫీని మొదటిసారి స్వీకరించాడు.
ముర్రే విఫలం
కెరీర్‌లో రెండు గ్రాండ్ శ్లామ్ టైటిళ్లతో ఈసారి ఫ్రెంచ్ ఓపెన్‌లోకి అడుగుపెట్టిన ముర్రే విఫలమయ్యాడు. ఫైనల్‌లో ప్రపంచ నంబర్ వన్ జొకోవిచ్‌ను ఢీకొన్న అతను తొలి సెట్‌ను 3-6 తేడాతో గెల్చుకున్నాడు. దీనితో అతను టైటిల్ సాధిస్తాడన్న అభిప్రాయం వ్యక్తమైంది. పనె్నండోసారి ఈ కిరీటం కోసం పోటీపడుతున్న జొకోవిచ్‌కు మరోసారి పరాభవం తప్పదన్న వాదన వినిపించింది. కానీ, తర్వాతి సెట్లలో ముర్రే అదే స్థాయిలో రాణించలేకపోయాడు. ఫలితంగా రన్నరప్ ట్రోఫీతోనే సరిపుచ్చుకున్నాడు. 2013లో వింబుల్డన్‌ను, అంతకు ముందు 2012లో యుఎస్ ఓపెన్‌ను గెల్చుకున్న అతను 2010, 2011, 2013, 2015 సంవత్సరాల్లో ఆస్ట్రేలియా ఓపెన్ ఫైనల్ చేరాడు. కానీ, టైటిల్‌ను గెల్చుకోలేక రన్నరప్ ట్రోఫీకే పరిమితమయ్యాడు. ఈసారి కూడా ఫైనల్ చేరిన అతనికి అదే ఫలితం పునరావృతమైంది. కాగా, ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ రేసులో ఉన్న అతను మొదటి రౌండ్‌లో రాడెక్ స్టెపానెక్‌ను ఓడించి శుభారంభం చేశాడు. తర్వాత వరుసగా మథియాస్ బోర్గే, ఇవో కార్లొవిచ్, జాన్ ఇస్నర్‌లపై గెలుపొంది క్వార్టర్ ఫైనల్స్‌లో అడుగుపెట్టాడు. రిచర్డ్ గాస్క్వెట్ నుంచి ఎదురైన ప్రతిఘటనను తిప్పికొట్టి సెమీస్ చేరాడు. అక్కడ అతనికి డిఫెండింగ్ చాంపియన్ స్టానిస్లాస్ వావ్రిన్కా ఎదురుపడ్డాడు. అతనిపై 6-4, 6-2, 4-6, 6-2 తేడాతో విజయం సాధించి, మొదటిసారి ఫైనల్‌లోకి అడుగుపెట్టిన ముర్రే, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్న లక్ష్యం తుది పోరులో బరిలోకి దిగాడు. కానీ, జొకోవిచ్ దూకుడుకు కళ్లెం వేయలేక పరాజయాన్ని చవిచూశాడు.

గార్సియా, మకరోవా జోడీకి
మహిళల డబుల్స్ టైటిల్
పారిస్: మహిళల డబుల్స్‌లో కరోలిన్ గార్సియా, ఎకతరీన మకరోవా జోడీ 6-3, 2-6, 6-4 ఆధిక్యంతో క్రిస్టినా మ్లాడెనోవిచ్, ఎలెనా వెస్నినా జోడీని ఓడించి టైటిల్ సాధించింది. కాగా, పురుషుల డబుల్స్ విభాగంలో ఫెలిసియానో లొపెజ్, మార్క్ లొపెజ్ జోడీ టైటిల్ కైవసం చేసుకుంది. వీరు బాబ్ బ్రియాన్, మైక్ బ్రియాన్ జోడీని 6-4, 6-7, 6-3 తేడాతో ఓడించి టైటిల్ కైవసం చేసుకున్నారు. అంతకు ముందు మిక్స్‌డ్ డబుల్స్ ఫైనల్‌లో లియాండర్ పేస్, మార్టినా హింగిస్ జోడీ 4-6, 6-4, 10-8 ఆధిక్యంతో సానియా మీర్జా, ఇవాన్ డోడింగ్ జోడీపై గెలిచిన విషయం తెలిసిందే.

దశాబ్దానికిపైగా అందని ద్రాక్షగా మిలిగిన ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్ శ్లామ్ టెన్నిస్ టైటిల్‌ను ఎట్టకేలకు సాధించిన ప్రపంచ నంబర్ వన్ నొవాక్ జొకోవిచ్.