క్రీడాభూమి

దక్షిణాసియన్ గేమ్స్‌లో సెమీస్ చేరిన భారత ఖోఖో జట్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖాట్మడు, డిసెంబర్ 2: ‘13వ దక్షిణాసియన్ గేమ్స్‌లో’ భారత పురుషుల ఖోఖో జట్టు విజయాల పరంపరను కొనసాగిస్తూ అజేయంగా నిలుస్తోంది. సోమవారం రెండు విజయాలను సొంతం చేసుకున్న ఈ జట్టు సెమీఫైనల్స్‌లోకి దూసుకెళ్లింది. తొలుత ఆతిధ్య నేపాల్ జట్టును ఇన్నింగ్స్ 12 పాయింట్ల భారీ తేడాతో 17-5 స్కోరుతో ఓడించింది. తర్వాత సాయంత్రం బంగ్లాదేశ్ జట్టుతో తలపడి ఇన్నింగ్స్ 2 పాయింట్ల తేడాతో 12-10 స్కోరుతో ఓడించింది. ఈ టోర్నీలో భారత్‌కు ఇది మూడో విజయం. మంగళవారం ఈ జుట్టు శ్రీలంకతో సెమీ ఫైనల్స్‌లో తలపడనుంది. మరో సెమీఫైనల్ మ్యాచ్‌లో నేపాల్ బంగ్లాదేశ్ తలపడతాయి. కాగా నేపాల్‌పై ఘనవిజయంలో భారత క్రీడాకారులు మహారాష్టక్రు చెందిన అభినందన్ పాటిల్, సాగర్ పోద్దార్ కీలక పాత్ర పోషించారు. అజేయంగా నిలుస్తున్న తమ జట్టు ఇదే విజయపరంపను కొనసాగిస్తుందని ఈ సందర్భంగా అభినందన్ పాటిల్, పోద్దార్ పేర్కొన్నారు.