క్రీడాభూమి

అండర్ -19 ఐసీఐసీ క్రికెట్ ప్రపంచ కప్ 2020 టోర్నీకి భారత జట్టు ఎంపిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 2: వచ్చే ఏడాది ఆరంభంలో దక్షిణాఫ్రికాలో జరుగనున్న ‘ఐసీసీ అండర్ 19 క్రికెట్ ప్రపంచ కప్ 2020’ పోటీల కోసం 15 మందితో కూడిన జట్టును భారత్ సోమవారం ప్రకటించింది. 1988 నుంచి గత ఏడాది వరకు ఈ టోర్నీల్లో నాలుగు విజయాలు సాధించి ఊపుమీదున్న భారత జట్టు ఈ దఫా డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగనుంది. జట్టుకు ప్రియంగార్గ్ సారధిగా ఎంపికయ్యాడు. దేశవాళీ క్రికెట్‌లో ఉత్తర్‌ప్రదేశ్ జట్టు ద్వారా ప్రాతినిధ్యం వహిస్తున్న గార్గ్ ఇప్పటి వరకు 12 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడి 66.69 సగటుతో రాణించాడు. ఇందులో ఓ డబుల్ సెంచరీ కూడా ఉంది. అలాగే ఈ జట్టులో ముంబయికి చెందిన మరో డబుల్ సెంచూరియన్ 17ఏళ్ల ఓపెనర్ యశశ్వి జైస్వాల్ ఉన్నాడు, ఇతను గత అక్టోబర్‌లో జరిగిన విజయ్ హజారే ట్రోఫీ 50 ఓవర్ల మ్యాచ్‌లో 154 బంతులు ఎదుర్కొని 203 పరుగులు సాధించి అద్భుతమైన అటతీరుతో ఆకట్టుకున్నాడు. అలాగే పేస్ బౌలర్లు సుశాంత్ మిశ్రా, కార్తీక్ త్యాగి, ఆకాష్ సింగ్, విద్యాధర్ పాటిల్ ఎంపికవగా, లెఫ్ట్‌ఆర్మ్ స్పిన్నర్లు అధర్వ అంకోలేకర్, శుభాంగ్ హెగ్డే, లెగ్ స్పిన్నర్లు రవిబిష్ణోయ్ జట్టుకు ఎంపికయ్యారు. దిగ్గజ విశ్రాంత క్రీడాకారుడు రాహుల్ ద్రావిడ్ కోచ్‌గా వ్యవహరించగా ప్రిద్వీషా సారధ్యంలోని జట్టు గత ఏడాది ఆస్ట్రేలియాపై ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది. అలాగే అంతకు ముందు 2000, 2008, 2012 సంవత్సరాల్లో జరిగిన టోర్నీల్లో సైతం భారత్ చాంపియన్‌గా నిలిచింది. కాగా జనవరి 19న బ్లోయెమ్‌ఫోంటియన్‌లో జరిగిన టోర్నీలో గ్రూప్-ఏలో న్యూజీల్యాండ్, శ్రీలంక, జపాన్ జట్లతోబాటు భారత్ పాల్గొంటుంది. అలాగే పోచఫ్‌స్ట్రూమ్‌లో ఫిబ్రవరి 9న ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. కాగా న్యూజీల్యాండ్‌లో జరిగిన గత ఎడిషన్‌కు సంబంధించిన టోర్నీలో ఘనవిజయం సాధించింది.
ఈ క్రమంలో ప్రస్తుతం జాతీయ క్రికెట్ అకాడమీ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న రాహుల్ ద్రావిడ్ మాట్లాడుతూ ప్రస్తుతం భారత జట్టు అన్నివిధాల సమతూకంతో ఉందని దక్షిణాఫ్రికా కండిషన్స్‌లో ఈ జట్టు అద్భుతంగా రాణిస్తుందని వ్యాఖ్యానించారు.
భారత జట్టు ఇదే..
ఐసీసీ అండర్ 19 క్రికెట్ ప్రపంచ కప్‌కు ప్రియం గార్గ్ (కెప్టెన్), యశశ్వి జైశ్వాల్, తిలక్ వర్మ, దివ్యాన్ష్ సక్సేనా, ధ్రువ్ చంద్ జూరెల్ (వైస్ కెప్టెన్), శాశ్వత్ రావత్, దివ్యాన్ష్ జోషి, శుభాంగ్ హెగ్డే, రవిబిష్ణోయ్, ఆకాష్ సింగ్, కార్తీక్ త్యాగి, అధర్వ అంకోలేకర్, కుమార్ కుశాగ్రా (వికెట్ కీపర్), సుశాంత్ మిశ్రా, విద్యాధర్ పాటిల్