క్రీడాభూమి

చదరంగంలో సరికొత్త రికార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమవరం, డిసెంబర్ 2: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూలు (డీపీఎస్)లో సోమవారం చదరంగం క్రీడకు సంబంధించి ఒక రికార్డు ఆవిష్కృతమయ్యింది. ఒకేసారి 108 మంది లిటిల్ మాస్టర్స్‌తో ఇంటర్నేషనల్ మాస్టర్ గిరినాథ్ తలపడ్డారు. సుమారు ఐదు గంటల పాటు రసవత్తరంగా సాగిన ఈ పోరులో నాలుగో రౌండ్ నుండి ఒక్కొక్కరుగా అందరినీ గిరినాథ్ ఓడిస్తూ వచ్చారు. మొత్తం 20 రౌండ్ల వరకూ లిటిల్ మాస్టర్స్ ఆయనతో పోరాటం సాగించారు. భీమవరం డీపీఎస్‌లో సోమవారం ఉదయం 9 గంటలకు చదరంగం బోర్డు ఆకారంలో మొత్తం 108 మంది విద్యార్థులు (లిటిల్ మాస్టర్స్) చదరంగం బోర్డులతో ఆటకు సిద్ధమయ్యారు. భారత రైల్వేస్ చదరంగం జట్టు కెప్టెన్ అయిన ఇంటర్నేషనల్ మాస్టర్ గిరినాథ్ వారీతో పోటీకి సిద్ధమయ్యారు. ఒకొక్కరుగా లిటిల్ మాస్టర్స్ వేసిన ఎత్తులకు గిరినాథ్ పైఎత్తు వేస్తూ వచ్చారు. తొలి మూడు రౌండ్ల వరకు 108 మందీ కొనసాగారు. నాలుగో రౌండ్ నుండి కొంతమంది వంతున ఔటవ్వడం ప్రారంభమయ్యింది. 9వ రౌండ్ వరకు కూడా లిటిల్ మాస్టర్స్ గిరినాథ్‌ని ముప్పుతిప్పలు పెడుతూనేవున్నారు. మొత్తం 20 రౌండ్ల వరకు ఆట సాగగా 11, 12 రౌండ్‌ల నుంచి 16వ రౌండ్ వరకు ఒకొక్కరు ఓటమి పాలవుతూ వచ్చారు. మొత్తం మీద 20వ రౌండ్ వరకు ఢిల్లీ పబ్లిక్ స్కూలు విద్యార్థి పచ్చమట్ల ప్రద్యుమ్న వర్మ మాత్రమే కొనసాగగలిగారు. చివరి రౌండ్ వరకూ నిలిచిన ప్రద్యుమ్నవర్మను ఇంటర్నేషనల్ మాస్టర్ గిరినాథ్ అభినందించారు. దీనితో ఆంధ్ర, తెలంగాణలో ఒకేసారి 108 మందితో ఐదు గంటల పాటు చదరంగం సాగించిన రికార్డు ఆవిష్కృతమయ్యింది. రికార్డు సృష్టించిన ఇంటర్నేషనల్ మాస్టర్ గిరినాథ్‌ను ఢిల్లీ పబ్లిక్ స్కూలు యాజమాన్యం సత్కరించింది. పశ్చిమ గోదావరి జిల్లా చదరంగం అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వైస్ ఛైర్మన్ డాక్టర్ వత్సవాయి శ్రీనివాసరాజు, జిల్లా చెస్ అసోసియేషన్ అధ్యక్షుడు తోట భోగయ్య, చెస్ మాస్టర్ మాదాసు కిషోర్, డిపిఎస్ ప్రిన్సిపల్ కెకె రావు తదితరులు పాల్గొన్నారు.
*చిత్రం... లిటిల్ మాస్టర్ ఎత్తుకు పైఎత్తు వేస్తున్న అంతర్జాతీయ మాస్టర్ గిరినాథ్