క్రీడాభూమి

కివీస్‌తో సిరీస్‌కు మార్పులేని ఆసీస్ జట్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అడెలైడ్, నవంబర్ 3: న్యూజిలాండ్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు ఆస్ట్రేలియా సెలక్షన్ కమిటీ టిమ్ పైన్ నాయకత్వంలోని జట్టులో ఎలాంటి మార్పు చేయలేదు. ఇంగ్లాండ్ జట్టును ఇంగ్లాండ్‌లోనే 2-0 తేడాతో ఓడించి, ప్రతిష్టాత్మకమైన యాషెస్ సిరీస్‌ను 2-0 తేడాతో కైవసం చేసుకున్న పైన్ బృందం ఆతర్వాత పాకిస్తాన్‌పై క్లీన్ స్వీప్ సాధించింది. దీనితో 13 మందితో కూడిన ఈ జట్టును కివీస్‌తో జరిగే సిరీస్‌లోనూ అథాతథంగా కొనసాగించాలని సెలక్టర్లు నిర్ణయించారు. పాక్‌తో జరిగిన సిరీస్‌లో ఆడిన జట్టులో మార్పులు అవసరమని భావించడం లేదని జాతీయ సెలక్టర్ ట్రెవర్ హాన్స్ వ్యాఖ్యానించాడు. పాక్‌పై అన్ని విభాగాల్లోనూ ఆసీస్ జట్టు అద్భుత ప్రతిభ కనబరచిందని ఒక ప్రకటనలో తెలిపాడు. అందుకే, పెర్త్, మెల్బోర్న్, సిడ్నీలో జరిగే మూడు టెస్టుల సిరీస్‌కు అదే జట్టును కొనసాగిస్తున్నట్టు ట్రెవర్ హాన్స్ తెలిపాడు.
జట్టు వివరాలు
టిమ్ పైన్ (కెప్టెన్), జో బర్న్స్, పాట్ కమిన్స్, జొష్ హాజెల్‌వుడ్, ట్రావిస్ హెడ్, మార్నస్ లబుషేన్, నాథన్ లియాన్, మైఖేల్ నెసెర్, జేమ్స్ పాటిన్సన్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, మాథ్యూ వేడ్, డేవిడ్ వార్నర్.

*చిత్రం...ఆసీస్ కెప్టెన్ టిమ్ పైన్