క్రీడాభూమి

మార్టినెజ్ కీలక గోల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చికాగో, జూన్ 6: కోపా అమెరికా ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో భాగంగా జమైకాతో జరిగిన మ్యాచ్‌ని వెనెజులా 1-0 తేడాతో తన ఖాతాలో వేసుకుంది. జోసెఫ్ మార్టినెజ్ కీలక గోల్ చేసి, వెనెజులాను విజయపథంలో నడిపాడు. లీగ్ దశలో సాధారణంగా ప్రతి జట్టూ అనుసరించే యుద్ధ నీతినే వెనెజులా అమలు చేసింది. మ్యాచ్ 15వ నిమిషంలోనే మార్టినెజ్ గోల్ సాధించడంతో 1-0 ఆధిక్యాన్ని సంపాదించిన ఆ జట్టు రక్షణాత్మక విధానాన్ని అనుసరించింది. ఎక్కువ సేపు బంతిని తన ఆధీనంలోనే ఉంచుకోవడం ద్వారా సాధ్యమైనంత వరకూ సమయాన్ని వృథా చేయాలన్న సంకల్పంతోనే ఆడింది. దీనితో గోల్స్ కోసం జమైకా చేసిన పోరాటాలు ఫలించలేదు. వెనెజులా రక్షణ వలయాన్ని ఛేదించలేకపోయిన జమైకా క్రీడాకారులకు గోల్ చేసే అవకాశం కూడా దక్కలేదు.
మెక్సికో గెలుపు
ఉరుగ్వేతో జరిగిన మ్యాచ్‌లో మెక్సికో 3-1 తేడాతో విజయభేరి మోగించింది. మ్యాచ్ నాలుగో నిమిషంలోనే మెక్సికోకు అల్వరో ఫెరెరా ద్వారా తొలి గోల్ లభించింది. అనంతరం మెక్సికో డిఫెన్స్‌కు పరిమితంకాగా, ఉరుగ్వే గోల్స్ కోసం ప్రయత్నించడంలో మునిగింది. కానీ, ప్రథమార్ధం ముగిసే వరకూ ఈక్వెలైజర్‌ను సాధించలేకపోయింది. ద్వితీయార్ధంలోనూ దాదాపు అదే పరిస్థితి కనిపించింది. అయితే, 74వ నిమిషంలో డిగో గోడిన్ ఉరుగ్వేకు గోల్‌ను సంపాదించి పెట్టడంతో స్కోరు సమమైంది. ఈ గోల్ సాధించిన వెంటనే ఉరుగ్వే రక్షణాత్మక విధానాన్ని అనుసరించగా, మెక్సికో దాడులకు ఉపక్రమించింది. 85వ నిమిషంలో పాఫెల్ మార్క్వెజ్ చక్కటి గోల్ చేసి, మెక్సికోకు 2-1 ఆధిక్యాన్ని అందించాడు. ఎక్‌స్ట్రా టైమ్‌లో హెక్టర్ హెరెనా మరో గోల్ సాధించడంతో మెక్సికో 3-1 తేడాతో మ్యాచ్‌ని గెల్చుకుంది.