క్రీడాభూమి

విండీస్‌ను గెలిపించిన హోప్, హాత్‌మేయర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, డిసెంబర్ 15: ఓపెనర్ షాయ్ హోప్, ఫస్ట్‌డౌన్ బ్యాట్స్‌మన్ షిమ్రన్ హాత్‌మేయర్ అపూర్వ శతకాలను నమోదు చేయడంతో, భారత్‌తో ఇక్కడి ఎంఏ చిదంబరం స్టేడియంలో ఆదివారం జరిగిన మొదటి వనే్డలో వెస్టిండీస్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. బలమైన బ్యాటింగ్ లైనప్ ఉన్నప్పటికీ, భారీ స్కోరును చేయలేకపోయిన టీమిండియా ఆతర్వాత బౌలింగ్‌లోనూ విఫలమైంది. విండీస్‌ను కట్టడి చేయడంలో చేతులెత్తేసింది. టాస్ గెలిచిన వెస్టిండీస్ బౌలంగ్ ఎంచుకోవడంతో, తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 287 పరుగులు చేసింది. మిడిల్ ఆర్డర్‌లో శ్రేయాస్ అయ్యర్, రిషభ్ పంత్ బాధ్యతాయుతంగా ఆడి, అర్ధ శతకాలు సాధించడంతో భారత్‌కు ఈమాత్రం స్కోరు సాధ్యమైంది. రోహిత్ శర్మ 36, కేదార్ జాదవ్ 40 చొప్పున పరుగులు చేయగా, కెప్టెన్ విరాట్ కోహ్లీ కేవలం నాలుగు పరుగులకే షెల్డన్ కాంట్రెల్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. అభిమానులను నిరాశపరిచాడు. విండీస్ బౌలర్లలో కాంట్రెల్, కెమో పాల్, అల్జమీ జోసెఫ్ తలా రెండేసి వికెట్లు పడగొట్టారు.
భారత్ నిర్దేశించిన 288 పరుగుల విజయ లక్ష్యాన్ని ఛేదించడానికి మైదానంలోకి దిగిన విండీస్ 11 పరుగుల వద్ద సునీల్ ఆంబ్రిస్ (9) వికెట్‌ను కోల్పోయింది. అతను దీపక్ చాహర్ బౌలింగ్‌లో ఎల్‌బీగా వెనుదిరిగాడు. ఆరంభంలోనే వికెట్ తీసిన ఆనందం భారత్‌కు ఎక్కువ సేపు నిలువలేదు. ఓపెనర్ హోప్‌తో కలిసిన హాత్‌మేయర్ పరుగుల వరద పారించారు. ఇద్దరూ భారత బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కొంటూ, పరుగులు రాబట్టారు. వీరి భాగస్వామ్యంలో, రెండో వికెట్‌కు 218 పరుగులు జత కలవడం భారత్ బౌలింగ్ వైఫల్యాలకు నిదర్శనం. 106 బంతులు ఎదుర్కొని, 11 ఫోర్లు, 7 సిక్సర్లతో 106 పరుగులు చేసిన హాత్‌మేయర్‌ను శ్రేయాస్ అయ్యర్ క్యాచ్ పట్టగా, మహమ్మద్ షమీ పెవిలియన్‌కు పంపాడు. అయితే, సెకండ్ డౌన్ ఆటగాడు నికొలస్ పూరన్ (29 నాటౌట్)తో కలిసి మరో వికెట్ కూలకుండా జాగ్రత్త పడిన హోప్ జట్టును విజయపథంలో నడిపాడు. 47.5 ఓవర్లలో 2 వికెట్లకు విండీస్ 291 పరుగులు చేసి, ఎనిమిది వికెట్ల తేడాతో విజయభేరి మోగించే సమయానికి హోప్ 102 (151 బంతులు, 7 ఫోర్లు, ఒక సిక్సర్) పరుగులతో నాటౌట్‌గా ఉన్నాడు. దీపక్ చాహర్, మహమ్మద్ షమీకి ఒక్కో వికెట్ లభించింది.
స్కోరుబోర్డు
భారత్ ఇన్నింగ్స్: రోహిత్ శర్మ సీ కీరన్ పొలార్డ్ బీ అల్జరీ జోసెఫ్ 36, లోకేష్ రాహుల్ సీ షిమ్రన్ హాత్‌మేయర్ బీ షెల్డన్ కాంట్రెల్ 6, విరాట్ కోహ్లీ బీ షెల్డన్ కాంట్రెల్ 4, శ్రేయాస్ అయ్యర్ సీ కీరన్ పొలార్డ్ బీ అల్జరీ జోసెఫ్ 70, రిషభ్ పంత్ సీ షిమ్రన్ హాత్‌మేయర్ బీ కీరన్ పొలార్డ్ 71, కేదార్ జాదవ్ సీ కీరన్ పొలార్డ్ బీ కీమో పాల్ 40, రవీంద్ర జడేజా రనౌట్ 21, శివమ్ దూబే సీ జాసన్ హోల్డర్ బీ కీమో పాల్ 9, దీపక్ చాహర్ 6 నాటౌట్, మహమ్మద్ షమీ 0 నాటౌట్, ఎక్‌స్ట్రాలు 24, మొత్తం (50 ఓవర్లలో 8 వికెట్లకు) 287.
వికెట్ల పతనం: 1-21, 2-25, 3-80, 4-194, 5-210, 6-269, 7-269, 8-282.
బౌలింగ్: షెల్డన్ కాంట్రెల్ 10-3-46-2, జాసన్ హోల్డర్ 8-0-45-0, హేడెన్ వాల్ష్ 5-0-31-0, కీమో పాల్ 7-0-40-2, అల్జరీ జోసెఫ్ 9-1-45-2, రోస్టన్ ఛేజ్ 7-0-42-0, కీరన్ పొలార్డ్ 4-0-28-1.
వెస్టిండీస్ ఇన్నింగ్స్: షాయ్ హోప్ 102 నాటౌట్, సునీల్ ఆంబ్రిస్ ఎల్‌బీ దీపక్ చాహర్ 9, షిమ్రన్ హాత్‌మేయర్ సీ శ్రేయస్ అయ్యర్ బీ మహమ్మద్ షమీ 139, నికొలాస్ పూరన్ 29 నాటౌట్, ఎక్‌స్ట్రాలు 12, మొత్తం (47.5 ఓవర్లలో 2 వికెట్లకు) 291.
వికెట్ల పతనం: 1-11, 2-229.
బౌలింగ్: దీపక్ చాహర్ 10-1-48-1, మహమ్మద్ షమీ 9-1-57-1, కుల్దీప్ యాదవ్ 10-0-45-0, శివమ్ దూబే 7.5-0-68-0, జాదవ్ 1-0-11-0, జడేజా 10-0-58-0.