క్రీడాభూమి

సౌథీ దెబ్బకు లంక విలవిల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హామిల్టన్, డిసెంబర్ 20: శ్రీలంక, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ ఆసక్తికరమైన మలుపులు తిరుగుతున్నది. నిన్నటి వరకూ శ్రీలంకది పైచేయికాగా, మ్యాచ్ మూడోరోజు, ఆదివారం టిమ్ సౌథీ విజృంభణతో కివీస్ ఆధిపత్యాన్ని సంపాదించింది. విజయం దిశగా అడుగులు వేస్తున్నది. శ్రీలంక మొదటి ఇన్నింగ్స్‌లో 292 పరుగులకు ఆలౌట్‌కాగా, ఆతర్వాత బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ శనివారం ఆట ముగిసే సమయానికి తొమ్మిది వికెట్లు కోల్పోయి 232 పరుగులు చేసింది. ఈ ఓవర్‌నైట్ స్కోరుతో ఆదివారం ఆటను కొనసాగించి, మరో ఐదు పరుగులు జోడించిన తర్వాత ట్రెంట్ బౌల్ట్ (0) వికెట్‌ను చేజార్చుకుంది. డౌగ్ బ్రాస్‌వెల్ 35 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. కాగా, మొదటి ఇన్నింగ్స్‌లో 55 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించిన శ్రీలంక రెండో ఇన్నింగ్స్‌లో దారుణంగా విఫలమైంది. కుశాల్ మేండిస్ (46) టాప్ స్కోరర్‌గా నిలవగా, అతనితోపాటు కరుణరత్నే (27), సిరివర్దన (26) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. మిగతా వారంతా సింగిల్ డిజిట్‌తోనే సరిపుచ్చుకున్నారు. సౌథీ 14.3 ఓవర్లు బౌల్ చేసి, కేవలం 26 పరుగులకే నాలుగు వికెట్లు పడగొట్టాడు. వాగ్నర్ 40 పరుగులకు మూడు వికెట్లు తీశాడు. బ్రాస్‌వెల్‌కు రెండు వికెట్లు లభించాయి.
ఆరంభంలో తడబాటు
శ్రీలంకను ఓడించి, సిరీస్‌ను కైవసం చేసుకోవాలన్న పట్టుదలతో రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభించిన న్యూజిలాండ్ మొదట్లో తడబడింది. 189 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 11 పరగులకే రెండు వికెట్లు కోల్పోయింది. అయితే, కేన్ విలియమ్‌సన్ క్రీజ్‌లో నిలదొక్కుకొని అజేయంగా 78 పరుగుల చేసి జట్టును ఆదుకున్నాడు. ఆట ముగిసే సమయానికి కివీస్ ఐదు వికెట్లకు 42 పరుగులు చేయగా, అతనితోపాటు వాల్టింగ్ పరుగుల ఖాతా తెరవకుండా నాటౌట్‌గా ఉన్నాడు. మొదటి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు పడగొట్టిన చమీర రెండో ఇన్నింగ్స్‌లో నాలు వికెట్లు కూల్చాడు. విజయానికి న్యూజిలాండ్ ఇంకా 47 పరుగులు చేయాల్సి ఉండగా, ఐదు వికెట్లు చేతిలో ఉన్నాయి.
సంక్షిప్త స్కోర్లు
శ్రీలంక తొలి ఇన్నింగ్స్ (ఓవర్‌నైట్ స్కోరు 7 వికెట్లకు 264): 81. ఓవర్లలో ఆలౌట్ 292 (కుశాల్ మేండిస్ 31, చండీమల్ 47, ఏంజెలో మాథ్యూస్ 77, సిరివర్దనే 62, సౌథీ 3/63, బౌల్ట్ 2/51, బ్రాస్‌వెల్ 2/81).
న్యూజిలాండ్ మొదటి ఇన్నింగ్స్ (ఓవర్ నైట్ స్కోరు 9 వికెట్లకు 232): 79.4 ఓవర్లలో ఆలౌట్ 237 (మార్టిన్ గుప్టిల్ 50, వాల్టింగ్ 28, సాంట్నర్ 38, బ్రాస్‌వెల్ 35 నాటౌట్, చమీర 5/47, హెరాత్ 2/75).
శ్రీలంక రెండో ఇన్నింగ్స్: 36.3 ఓవర్లలో 133 ఆలౌట్ (కుశాల్ మేండిస్ 46, కరుణ రత్నే 27, సిరివర్దనే 26, సౌథీ 4/26, బ్రాస్‌వెల్ 2/31, వాగ్నర్ 3/40).
న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్ (లక్ష్యం 189 పరుగులు: మూడోరోజు ఆట ముగిసే సమయానికి ఐదు వికెట్లకు 142 (కేన్ విలియమ్‌సన్ 78 నాటౌట్, రాస్ టేలర్ 35, బ్రెండన్ మెక్‌కలమ్ 18, దుష్మంత చమీర 45 పరుగులకు 4 వికెట్లు).
మ్యాచ్‌లో మిగిలిన రోజులు: రెండు.
కివీస్ చేయాల్సిన పరుగులు: 47.
చేతిలో ఉన్న వికెట్లు: ఐదు.