క్రీడాభూమి

రేసులో సంధూ, ప్రసాద్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జూన్ 8: భారత క్రికెట్ జట్టు కోచ్ పదవికి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ప్రస్తుతం తాత్కాలిక కోచ్‌గా సంజయ్ బంగార్ వ్యవహరిస్తుండగా, హేమాహేమీలు ఒక్కొక్కరే బరిలోకి దిగుతున్నారు. భారత జాతీయ సెలక్షన్ కమిటీ చైర్మన్ సందీప్ పాటిల్, మాజీ డైరెక్టర్ రవి శాస్ర్తీ ఇప్పటికే దరఖాస్తు చేసుకోగా, తాజాగా మాజీ ఫాస్ట్ బౌలర్లు వెంటేశ్ ప్రసాద్, బల్వీందర్ సింగ్ సంధూ కూడా రేసులోకి దూకారు. భారత క్రికెట్‌కు విశిష్ట సేవలు అందించిన ‘ది వాల్’ రాహుల్ ద్రవిడ్ పేరు ఆరంభంలో వినిపించినప్పటికీ, అతను ఇంకా దరఖాస్తు చేసుకోలేదు. భారత్ ‘ఎ’ జట్టుకు ప్రస్తుతం కోచ్‌గా ఉన్న అతని వైపే భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) మొగ్గు చూపిస్తుందని అంతా అనుకున్నారు. అయితే, అతను రంగంలోకి దిగకముందే, రేసులోకి వస్తున్న వారి సంఖ్య పెరుగుతున్నది. టీమిండియాకు డైరెక్టర్‌గా వ్యవహరించిన రవి శాస్ర్తీ కాంట్రాక్టు ఇటీవలే ముగిసింది. నిరుడు ప్రపంచ కప్ చాంపియన్‌షిప్ సమయంలో డంకన్ ఫ్లెచర్ చీఫ్‌గా ఉన్నప్పటికీ, అతనిని నామమాత్రపు స్థానానికి నెట్టేసిన రవి శాస్ర్తీ అంతా తానై వ్యవహరించాడు. ఫ్లెచర్ కాంట్రాక్టు ముగిసిన తర్వాత కోచ్‌గా అదనపు బాధ్యతలను బిసిసిఐ అతనికే అప్పగించింది. పాలనా వ్యవహారాలు, నియామకాలు పారదర్శకంగా ఉండాలన్న ఉద్దేశంతో కోచ్, సపోర్టింగ్ స్ట్ఫా నియామకం కోసం బిసిసిఐ ఇటీవలే ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇతరత్రా అర్హతలతోపాటు హిందీలో మాట్లాడడం కూడా కోచ్ పదవికి అత్యవసరమని బోర్డు అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ చేసిన ప్రకటనతో, ఇన్నాళ్లూ విదేశీ కోచ్ వస్తాడేమోనన్న అనుమానంతో దూరంగా ఉన్న పలువురు మాజీ క్రికెటర్లు ఇప్పుడు ఈ పదవివైపు ఆసక్తిని చూపుతున్నారు. నిజానికి తొలుత వచ్చిన వార్తల ప్రకారం రేసులో అందరి కంటే ద్రవిడ్ పేరు వినిపించింది. బోర్డు ప్రకటన ఆధారంగా, తొలుత డైరెక్టర్ పదవికి రవి శాస్ర్తీ మరోసారి దరఖాస్తు చేసుకున్నాడు. అదే విధంగా, కాంట్రాక్టు పూర్తయిన బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగార్, బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్ శ్రీ్ధర్ కూడా తిరిగి అవే పదవులకు దరఖాస్తు పంపారు. ఈ నలుగురు తమతమ పదవులను దక్కించుకుంటారన్న అభిప్రాయం వ్యక్తమైంది. కానీ హఠాత్తుగా రవి శాస్ర్తీ కోవచ్ పదవికి దరఖాస్తు పంపి, అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. టీం డైరెక్టర్‌గా ఉండేందుకే ఆసక్తి చూపుతున్నట్టు పలు సందర్భాల్లో ప్రకటించిన అతను హఠాత్తుగా కోచ్ పదవి కోసం ఎందుకు పరుగులు తీస్తున్నాడన్నది అంతుబట్టని ప్రశ్నగా మారింది. కాగా, ఇంగ్లీషుతోపాటు హిందీ మాట్లాడడం వస్తేనే ఆటగాళ్లతో కోచ్‌కి సాన్నిహిత్యం పెరుగుతుందని బిసిసిఐ అభిప్రాయపడుతున్నదన్న సమాచారం తెలిసిన వెంటనే మాజీ క్రికెటర్లు పలువురు కోచ్ పదవివైపు ఆసక్తిగా చూడడం మొదలుపెట్టారు. కోచ్ ఎంపిక ఏ కోణంలో జరుగుతుందో, ఏఏ అంశాలను పరిగణలోకి తీసుకుంటారో ఠాకూర్ చెప్పకనే చెప్పాడు. హిందీ మాట్లాడడాన్ని ముఖ్యమైన అర్హతగా భావిస్తే, విదేశీయులు ఎవరూ దరఖాస్తు చేసుకునే అవకాశం లేదని, కాబట్టి భారతీయుడికే కోచ్ పదవి దక్కుతుందని స్పష్టమవుతోంది. గతంలో సౌరవ్ గంగూలీ, వివిఎస్ లక్ష్మణ్ పేర్లు ప్రముఖంగా వినిపించాయి. అప్పట్లోనే రవి శాస్ర్తీని పేరు కూడా ప్రస్తావనకు వచ్చింది. అయితే, సచిన్ తెండూల్కర్‌తోపాటు గంగూలీ, లక్ష్మణ్‌ను భారత క్రికెట్ సలహాదారులుగా బిసిసిఐ నియమించింది. రవి శాస్ర్తీకి టీమిండియా డైరెక్టర్ బాధ్యతలను అప్పగించింది. 18 నెలలు అతను భారత జట్టుకు డైరెక్టర్‌గా వ్యవహరించాడు. మరోసారి అతను అదే పదవిని స్వీకరిస్తాడన్న అభిప్రాయం వ్యక్తమైంది. కానీ, అతను ఎవరూ ఊహించని విధంగా కోచ్ రేసులోకి వచ్చేశాడు. నిరుడు ఫిబ్రవరి 14 నుంచి మార్చి 15వ తేదీ వరకు జరిగిన ప్రపంచ కప్ చాంపియన్‌షిప్‌తో అప్పటి కోచ్ ఫ్లెచర్ కాంట్రాక్టు ముగియగా, బిసిసిఐ కోరిక మేరకు కోచ్‌గా అదనపు బాధ్యతలు స్వీకరించిన అతను ద్విపాత్రాభినయాన్ని సమర్థంగా పూర్తి చేశాడు. కాబట్టి, ఇప్పుడు కోచ్ పదవికి దరఖాస్తు చేసుకున్న అతనికే ఆ పదవి దక్కుతుందన్న వాదన వినిపిస్తున్నది.
అనుకోకుండా ఆ ఇద్దరు..
సందీప్ పాటిల్, రవి శాస్ర్తీ మధ్య కోచ్ పదవికి పోటీ తీవ్రంగానే ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతున్న నేపథ్యంలో హఠాత్తుగా మరో ఇద్దరు గోదాలోకి దిగారు. అంతర్జాతీయ కెరీర్ ముగిసిన తర్వాత సపోర్టింగ్ స్ట్ఫా రూపంలో ప్రసాద్ భారత క్రికెట్‌కు సేవలు అందిస్తునే ఉన్నాడు. కానీ, 1983 వరల్డ్ కప్ సాధించిన భారత జట్టులో సభ్యుడు, ఆ టోర్నీలో అసమాన ప్రతిభ కనబరచిన ఫాస్ట్ బౌలర్ బల్వీందర్ సింగ్ సంధూ గురించి చాలా మంది దాదాపుగా మరచిపోయారు. తాము కోచ్ పదవికి దరఖాస్తు చేసుకున్నామని వీరిద్దరూ బుధవారం వేరువేరు ప్రకటనల్లో పేర్కోవడంతో, ప్రస్తుతానికి చతుర్ముఖ పోటీ కొనసాగుతున్నది. ఇంకెంత మంది దరఖాస్తు చేసుకుంటారో చూడాలి. ప్రసాద్ తన కెరీర్‌లో 33 టెస్టులు ఆడి, 203 పరుగులు చేశాడు. అజేయంగా 30 పరుగులు అతని అత్యధిక స్కోరు. 7,041 బంతులు వేసి, 8,129 పరుగులిచ్చి 96 వికెట్లు కూల్చాడు. 33 పరుగులకు ఆరు వికెట్లు టెస్టుల్లో అతని అత్యుత్తమ ప్రదర్శన. కాగా, 161 వనే్డ ఇంటర్నేషనల్స్ ఆడిన అతను 221 పరుగులు సాధించాడు. ఉత్తమ స్కోరు 19 పరుగులు. 3,360 బంతులు వేసి, 6,332 పరుగులిచ్చి 196 వికెట్లు సాధించాడు. 27 పరుగులకు ఐదు వికెట్లు వనే్డల్లో అతని ఉత్తమ విశే్లషణ. సంధూ విషయానికి వస్తే, అతను కెరీర్‌లో 8 టెస్టులు, 27 వనే్డ ఇంటర్నేషనల్స్ ఆడాడు. టెస్టుల్లో 214 (అత్యధిక స్కోరు 71), వనే్డల్లో 51 (అత్యధిక స్కోరు 16 నాటౌట్) పరుగులు సాధించాడు. టెస్టుల్లో 1,020 బంతులు వేసి, 557 పరుగులకు పది వికెట్లు పడగొట్టాడు. అత్యుత్తమంగా 87 పరుగులిచ్చి మూడు వికెట్లు కూల్చాడు. వనే్డల్లో 1,110 బంతులు వేసిన సంధు 763 పరుగులు సమర్పించుకొని 16 వికెట్లు సాధించాడు. 27 పరుగులకు మూడు వికెట్లు వనే్డల్లో అతని ఉత్తమ విశే్లషణ. మొత్తం మీద ప్రసాద్, సంధూ దరఖాస్తు చేసుకోవడంతో భారత కోచ్ పదవికి జరుగుతున్న పోటీ ఆసక్తికరంగా మారింది.