క్రీడాభూమి

‘బంగ్లా’ ఫస్ట్‌క్లాస్ క్రికెట్ చరిత్రలో సరికొత్త రికార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఢాకా, ఫిబ్రవరి 3: బంగ్లాదేశ్ ఎడమచేతి బ్యాట్స్‌మన్ తమీమ్ ఇక్బాల్ పస్ట్‌క్లాస్ క్రికెట్‌లోత్రిపుల్ సెంచరీ సాధించడం ద్వారా టెస్టు జట్టులోకి పునరాగమన అవకాశాలను ఖాయం చేసుకున్నాడు. ఆదివారంతో ముగిసిన ఈ మ్యాచ్‌లో 334 పరుగులు సాధించిన తమీమ్ బంగ్లాదేశ్ గడ్డపై ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్‌మన్‌గా రికార్డు సృష్టించాడు. లోగడ అండర్-19 జట్టు సభ్యుడు రకీబుల్ హసన్ సాధించిన 313 పరుగులను, 2014లో బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లోశ్రీలంక బ్యాట్స్‌మన్ కుమార సంగక్కర సాధించిన 319 పరుగులను సైతం ఈ సందర్భంగా తమీమ్ ఇక్బాల్ అధిగమించడం విశేషం. తనకిది అత్యంత ప్రత్యేకమని, అందరికీ కలలు ఉంటాయి. కానీ నాకిలా అది సుసాధ్యవౌతుందనుకోలేదని ఈ సందర్భంగా తమీమ్ ఆనందం వ్యక్తం చేశాడు.