క్రీడాభూమి

రెండో స్థానానికి ఎగబాకిన కేఎల్ రాహుల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుబాయ్: భారత జట్టు న్యూజీలాండ్ పర్యటనలో 5-0 తేడాతో టీ 20 సిరీస్‌ను కైవసం చేసుకోవడంలో ఆల్ రౌండ్ ప్రతిభతో విశేషంగా ఆకట్టుకున్న యువ వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ కేఎల్ రాహుల్ ఐసీసీ టీ 20 ర్యాంకింగ్స్‌లో రెండవ స్థానానికి ఎగబాకాడు. సోమవారం విడుదలైన ఈ తాజా జాబితాలో రాహుల్ తన కెరీర్ బెస్ట్ స్థానానికి చేరి ప్రశంసలందుకున్నాడు. ఆ సిరీస్‌లో రాహుల్ మొత్తం 224 పరుగులు సాధించగా అందులో రెండు అర్థ సెంచరీలు, మరో 40 ప్లస్ పరుగులు ఉన్నాయి. అలాగే వికెట్ కీపర్‌గానూ విశేషంగా రాణించాడు. కాగా పాకిస్తాన్ ఆటగాడు బాబర్ అజమ్ ఈ జాబితాలో అగ్ర స్థానంలో నిలువగా, భారత వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాట్స్‌మన్ ర్యాంకింగ్స్‌లో టాప్ టెన్‌లోకి చేరాడు. భారత జట్టు సారధి విరాట్ కోహ్లి 9వ స్థానంలో కొనసాగుతున్నాడు. కాగా ఇతర భారత క్రీడాకారుల్లో శ్రేయస్ అయ్యర్ 63 స్థానాలు మెరుగుపరచుకుని 55వ స్థానానికి ఎగబాకగా, మనీష్ పాండే 12 స్థానాలు మెరుగుపరుచుకుని 58వ ర్యాంకుకు చేరాడు. భారత బౌలింగ్ విభాగంలో జిస్పిత్ బుమ్రా 26 స్థానాలు మెరుగుపరచుకుని 11వ ర్యాంకును దక్కించుకోగా, యజువేంద్ర చాహల్ 10 స్థానాలను ఎగబాకి 30వ ర్యాంకును, గత సిరీస్‌లో ఎనిమిది వికెట్లు పడగొట్టిన శార్దూల్ ఠాకూర్ 34 స్థానాలు ఎగబాకి 57వ ర్యాంకును దక్కించుకున్నాడు. అలాగే నవ్‌దీప్ సైనీ 25 స్థానాలు మెరుగుపరచుకుని 71 ర్యాంకును, రవీంద్ర జడేజా 34 స్థానాలు ఎగబాకి 76వ ర్యాంకును దక్కించుకున్నారు. సిరీస్‌లో 160 పరుగులు సాధించిన న్యూజీలాండ్ కెప్టెన్ కానె విలియమ్‌సన్ 23వ ర్యాంకు నుంచి 16వ ర్యాంకుకు చేరాడు. ఆ జట్టులోని టిమ్ సీఫెర్ట్ 73వ ర్యాంకు నుంచి 34వ ర్యాంకుకు ఎగబాకగా, రాస్ టేలర్ 50వ ర్యాంకు నుంచి 39వ ర్యాంకుకు చేరాడు. లెగ్ స్పిన్నర్ ఇష్ సోధి ఆరు ర్యాంకులు మెరుగుపరచుకుని 13వ స్థానానికి చేరాడు.

*చిత్రం... కేఎల్ రాహుల్