క్రీడాభూమి

ఆ విషయంలో ధోనీదే తుది నిర్ణయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయ, ఫిబ్రవరి 6: టీమిండియా సీనియర్ ఆటగా డు, మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ రిటైర్మెంట్‌పై వస్తు న్న ఊహాగానాలకు తెరపడడం లేదు. ఇదే విషయమై సెలక్షన్ కమిటీ మాజీ చైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ సైతం స్పందించాడు. సెలక్షన్ కమిటీ చైర్మన్‌గా తన పదవీ కాలం పూర్తి చేసుకున్న ఎమ్మెస్కే స్టార్‌స్పోర్ట్స్ ఛానెల్‌తో మాట్లాడాడు. సెలక్షన్ కమిటీ చైర్మన్ పదవి పక్కనే బెడితే త ను ధోనీకి పెద్ద వీరాభిమానినని చెప్పుకొచ్చాడు. అయతే ఇటీవ ల ధోనీ రిటైర్మెంట్‌పై వస్తున్న వార్తలపై స్పందిస్తూ ధోనీ జట్టుకు ఇప్పటికే ఏం కావాలో అది చేశాడని, రెండు ప్రపంచకప్‌లతో పాటు 1 చాంపియన్ ట్రోఫీ అందించాడని గుర్తుచేశాడు. అలాగే జట్టును టెస్టుల్లో నెంబర్ 1 స్థానంలో నిలబెట్టాడన్నాడు. అయతే ధోనీ రిటైర్మెంట్ విషయమై తనకు తెలిసి అతడి నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుందన్నాడు. ధోనీ చివరిసారిగా ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌తో సెమీ ఫైనల్‌లో ఆడాడు. ఆ తర్వాత రెండు నెలలు ఆర్మీకి సేవలందించినా, తిరిగి జట్టులో చేరలేదు. దీంతో ధోనీ రిటైర్మెంట్‌పై ఇప్పటికీ స్పష్టత రావడం లేదు.
*చిత్రం...సెలక్షన్ కమిటీ మాజీ చైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్