క్రీడాభూమి

బంగ్లా కెప్టెన్ అక్బర్ అలీ క్రీడా స్ఫూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఢాకా: తన సోదరి అకాల మరణం ఎంతగానో వేధిస్తున్నా ఆ ఆవేదనను పంటి బిగువన పెట్టుకుని క్రీడాస్ఫూర్తిని చాటిచెప్పాడు బంగ్లాదేశ్ అండర్-19 కెప్టెన్ అక్బర్ అలీ. భారత్‌తో ఆదివారం జరిగిన ప్రపంచ కప్ ఫైనల్‌లో తమ జట్టు విజయం సాధించడంలో సమర్ధవంతమైన పాత్రను పోషించిన అలీ పాత్రను పలువురు క్రీడా పండితులు అభినందించారు. 18 ఏళ్ల ఈ బంగ్లా కెప్టెన్ అలీ సోదరి ఖదీజా ఖాటూన్ గత నెల 22న ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చిన సందర్భంగా దురదృష్టవశాత్తూ అసువులు బాసింది. అయితే, అప్పటికే అండర్-19 ప్రపంచం టోర్నీలో తలమునకలైన ఉన్న అలీకి తన సోదరి మృతి విషయాన్ని తెలపకుండా కుటుంబ సభ్యులు దాచిపెట్టారు. తన సోదరిని ఎంతగానో ప్రేమించే అక్బర్ అలీ ప్రపంచ కప్ మ్యాచ్‌లలో బిజీగా ఉన్నప్పటికీ ఒక సందర్భంలో తన సోదరుడికి ఫోన్ చేసి, సోదరి ఆరోగ్య పరిస్థితి తెలుసుకునే ప్రయత్నం చేశాడు. అయితే, జరిగిన దురదృష్ట సంఘటనను ఆలస్యంగా తెలుసుకుని సోదరి మరణం పట్ల విచారం వ్యక్తం చేసినట్టు అలీ తండ్రి బంగ్లాదేశ్ డైలీ ‘ప్రోతోమ్ అలో’కు తెలిపాడు. ఇదిలావుండగా, తాను ఎంతగానో ప్రేమించే తన సోదరి అకాల మరణాన్ని జీర్ణించుకోలేని పరిస్థితులు నెలకొన్నా దేశం కోసం ఆటలో గెలుపే ధ్యేయంగా పట్టుదలతో పోరాడడం ద్వారా క్రీడా స్ఫూర్తిని ప్రపంచానికి చాటిచెప్పాడు. ఇదిలావుండగా, దక్షిణాఫ్రికాలోని పోచెఫ్‌స్ట్రూమ్‌లో ఐసీసీ నిర్వహించిన టోర్నమెంట్‌లో బంగ్లాదేశ్ తొలిసారిగా డిఫెండింగ్ చాంపియన్ టీమిండియాను ఓడించి ప్రపంచ కప్‌ను ముద్దాడిన విషయం తెలిసిందే. ఆదివారం డక్‌వర్త్ అండ్ లూయిస్ పద్ధతిలో జరిగిన ఫైనల్ పోరులో భారత్ 42.1 ఓవర్లలో 170 పరుగులు చేయగా, బంగ్లాదేశ్ 47.2 ఓవర్లలో 177 పరుగులు చేసి అండర్-19లో ప్రపంచ కప్‌ను తొలిసారిగా అందుకున్న ఘనతను సాధించింది. అయితే, తనను ఎంతగానో ప్రేమించే, అభిమానించే సోదరుడు తమ దేశానికి తొలిసారిగా ప్రపంచ కప్‌ను అందించిన ఘనతను స్వయంగా చూసేందుకు అక్బర్ అలీ సోదరికి ఆస్కారం లేకపోవడం నిజంగా విచారకరం.
*చిత్రం... బంగ్లా కెప్టెన్ అక్బర్ అలీ