క్రీడాభూమి

గుజరాత్‌కు భారీ ఆధిక్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నడియాడ్: రంజీట్రోఫీలో భాగంగా ఆంధ్రా జట్టుతో జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ భారీ ఆధిక్యాన్ని సంపాదించింది.
ఓవర్ నైట్ స్కోర్ 2 పరుగులతో రెండో రోజు మ్యాచ్‌లో బ్యాటింగ్ దిగిన గుజరాత్ 51 పరుగుల వద్ద సమిత్ గోహెల్ (19) వికెట్‌ను కోల్పోయంది. ఆ తర్వాతి బంతికే ప్రియాంక్ పంచల్ (29), మరి కొద్దిసేపటికే భార్గవ్ మెరాయ (28), మనీప్రీత్ జునేజా (1) వికెట్లకు కోల్పోయ కష్టాల్లో పడింది. ఈ క్రమంలో కెప్టెన్, వికెట్ కీపర్ పార్థీవ్ పటేల్ (57) అర్ధ సెంచరీ సాధించి పెవిలియన్‌కు చేరగా, అక్షర్ పటేల్ (89), చిరాగ్ గాంధీ (80, నాటౌట్) సైతం అర్ధ సెంచరీలను సాధించాడు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి గుజరాత్ 6 వికెట్లను కోల్పోయ 354 పరుగులు చేసింది. చిరాగ్‌తో పాటు యాష్ గర్దారియా (37) క్రీజులో ఉన్నాడు.