క్రీడాభూమి

ఇశాంత్ శర్మ ఫిట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15: భారత సీనియర్ ఫాస్ట్ బౌలర్ ఇశాంత్ శర్మ ఫిట్నెస్ పరీక్షను విజయవంతంగా ముగించాడు. త్వరలోనే న్యూజిలాండ్‌లో ఉన్న టీమిండియాను కలుసుకుంటాడు. గత నెల 21న, రంజీ ట్రోఫీలో ఢిల్లీ తరఫున విదర్భతో ఫిరోజ్ షా కోట్ల మైదానంలో మ్యాచ్ ఆడుతున్నప్పుడు ఇశాంత్ కుడి కాలి మడమ బెణికింది. ఫిజియోథెరపీతోపాటు, మళ్లీ ఫిట్నెస్‌ను సంపాదించుకునేందుకు అధికారులు అతనిని బెంగళూరులోని జాతీయ క్రికెట్ ఆకాడెమీకి పంపారు. అక్కడ నిపుణుల పర్యవేక్షణలో ఇశాంత్ పూర్తిగా కోలుకున్నాడని భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బీసీసీఐ) శనివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడేందుకు భారత జట్టు ప్రస్తుతం న్యూజిలాండ్‌లో ఉన్న విషయం తెలిసిందే. ఈనెల 21వ తేదీ నుంచి మొదటి టెస్టు ప్రారంభమవుతుందని, ఈలోగా ఇశాంత్ అక్కడికి వెళతాడని బీసీసీఐ తన ప్రకటనలో పేర్కొంది. కెరీర్‌లో ఇప్పటి వరకూ 96 టెస్టులు ఆడిన ఇశాంత్ మరో నాలుగు మ్యాచ్‌లు ఆడితే ‘100 టెస్టుల’ జాబితాలో చేరతాడు. కపిల్ దేవ్ తర్వాత వంద టెస్టులు ఆడిన తొలి భారత పేసర్‌గా ఇశాంత్ రికార్డు పుస్తకాల్లో చేరతాడు. ఇలావుంటే, జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ, ఉమేష్ యాదవ్ వంటి మేటి ఫాస్ట్ బౌలర్లు ఇప్పటికే న్యూజిలాండ్‌లో ఉన్నారు. 31 ఏళ్ల ఇశాంత్ వారితో పోటీపడి, ప్లేయింగ్ ఎలెవెన్‌లో చోటు దక్కించుకుంటాడా అన్నది అనుమానమే.

*చిత్రం...భారత సీనియర్ ఫాస్ట్ బౌలర్ ఇశాంత్ శర్మ