క్రీడాభూమి

భావన సంచలనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాంచీ, ఫిబ్రవరి 15: యువ అథ్లెట్ భవనా జాట్ ఈ ఏడాది టోక్యోలో జరిగే ఒలింపిక్స్‌లో మహిళల 20 కిలోమీటర్ల రేస్ వాక్‌కు క్వాలిఫై అయింది. జాతీయ చాంపియన్‌షిప్స్‌లో భాగంగా శనివారం 20 కిలోమీటర్ల నడకలో పాల్గొన్న 23 ఏళ్ల భావన తన లక్ష్యాన్ని ఒక గంట, 31 నిమిషాల్లో చేరుకొని సంచలనం సృష్టించింది. స్వర్ణ పతకాన్ని అందుకోవడమేగాక, కొత్త జాతీయ రికార్డును నెలకొల్పింది. భారత్ తరఫున ఒలింపిక్స్‌లో 20 కిలోమీటర్ల నడకలో పోటీపడే అవకాశాన్ని దక్కించుకున్న రెండో అథ్లెట్‌గా రికార్డు పుస్తకాల్లో చోటు దక్కించుకుంది. ఇంతకు ముందు ఈ ఈవెంట్‌లో పోటీపడే అవకాశం కుష్బీర్ కౌర్‌కు లభించింది. ఆమె 2016 రియో ఒలింపిక్స్‌లో పాల్గొంది. టోక్యో ఒలింపిక్స్‌లో భావన సత్తా నిరూపించుకోవడానికి సిద్ధమవుతున్నది. గత ఏడాది అక్టోబర్‌లో 20 కిలోమీటర్ల నడకను ఒక గంట, 38 నిమిషాల, 30 సెకన్లలో పూర్తి చేసిన భావన మరోసారి తన వ్యక్తిగత టైమ్‌ను మెరుగుపరచుకుంది. ఆ క్రమంలోనే జాతీయ రికార్డును బద్దలు చేసింది. జైపూర్‌కు చెందిన భావన ప్రస్తుతం గుర్ముఖ్ సిహాంగ్ వద్ద శిక్షణ పొందుతున్నది. ఒలింపిక్స్‌కు అర్హత సంపాదించిన నేపథ్యంలో, ఆమెకు అంతర్జాతీయ స్థాయి శిక్షకుల మార్గదర్శకం అవసరం అవుతుంది.

*చిత్రం...యువ అథ్లెట్ భవనా జాట్