క్రీడాభూమి

డోప్ దోషి ఉత్యుగొవ్‌పై వేటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాస్కో, ఫిబ్రవరి 15: నిషిద్ధ ఉత్ప్రేరకాలు వాడినట్టు డోపింగ్ పరీక్షలో తేలడంతో రష్యాకు చెందిన బియాథ్లెట్ యెవ్‌గెనీ ఉత్యుగొవ్‌పై సస్పెన్షన్ వేటు పడింది. అంతేగాక వింటర్ ఒలింపిక్స్‌లో సాధించిన స్వర్ణ పతకాన్ని అతను కోల్పోనున్నాడు. 34 ఏళ్ల ఉత్యుగొవ్ 2014 సోచీ వింటర్ ఒలింపిక్స్ రిలే ఈవెంట్‌లో పాల్గొని స్వర్ణ పతకాన్ని సాధించాడు. 2010 వాంకోవర్ ఒలింపిక్స్‌లో 15 కిలోమీటర్ల మాస్ స్టార్ట్ ఈవెంట్‌లో స్వర్ణ పతకం అందుకున్న అతను 2014లో బయథ్లాన్‌లో తిరుగులేని ఆధిపత్యాన్ని కనబరిచి, స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు. అయితే, ఆ సమయంలో నిర్వహించిన డోప్ పరీక్షలో ఉత్యుగొవ్ నిషిద్ధ మాదక ద్రవ్యాలను వినియోగించినట్టు రుజువైంది. ఈ ఫలితాలపై అతను చేసుకున్న వినతిపై సానుకూలంగా స్పందించిన అంతర్జాతీయ బియథ్లాన్ యూనియన్ (ఐబీయూ) ‘బీ’ శాంపిల్‌ను కూడా పరీక్షించాలని సూచించింది. అందులోనూ ఉత్యుగొవ్ మాదక ద్రవ్యాలు వాడినట్టు తేలడంతో అతనిపై సస్పెన్షన్ వేటు వేసింది. అంతేగాక, 2014 వింటర్ ఒలింపిక్స్‌లో సాధించిన స్వర్ణ పతకాన్ని వెనక్కు తీసుకుంటున్నట్టు ప్రకటించింది. అదే విధంగా స్వెత్లానా స్లెస్టోవా 2013-14 సంవత్సరాల మధ్య కాలంలో సాధించిన అన్ని రకాల పతకాలను, నెలకొల్పిన రికార్డులను రద్దు చేస్తున్నట్టు ఐబీయూ స్పష్టం చేసింది. ఆమె కూడా మాదక ద్రవ్యాలను వాడినట్టు డోప్ పరీక్షలో రుజువైందని, కాబట్టి నిబంధనలను అనుసరించి పతకాలను రద్దు చేశామని వివరించింది. 2020 వింటర్ ఒలింపిక్స్‌లో వారు పాల్గొనే అవకాశం లేదని ప్రకటించింది.
*యెవ్‌గెనీ ఉత్యుగొవ్ (ఫైల్ ఫొటో)