క్రీడాభూమి

ఐసీఏకు నిధులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అధ్యక్షతన ఆదివారం ఇక్కడ సమావేశం కానున్న భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బీసీసీఐ) పాలక మండలి సమావేవం పలు కీలక నిర్ణయాలు తీసుకోనుంది. సుప్రీం కోర్టు ఆదేశాల నేపథ్యంలో ఏర్పడిన భారత క్రికెటర్ల సంఘం (ఐసీఏ)కు నిధుల కేటాయింపు ఈ సమావేశంలో ప్రధానంగా చర్చకు వస్తుందని అంటున్నారు. అదే విధంగా కొత్త ఎథిక్స్ అధికారి నియామకాన్ని ఖరారు చేయడంతోపాటు మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. చాలాకాలం తర్వాత సౌరవ్ గంగూలీ అధ్యక్షుడిగా, తొమ్మిది మంది సభ్యులతో కూడిన పాలక మండలి గత ఏడాది ఏర్పడిన విషయం తెలిసిందే. నవంబర్‌లో తొలిసారి లాంఛనంగా సమావేశమైన తర్వాత బీసీసీఐ పాలక మండలి మళ్లీ కలవలేదు. నిబంధనల ప్రకారం కనీసం ప్రతి మూడు నెలలకు ఒకసారి సమావేశాన్ని నిర్వహించాలి. కాగా, ఆదివారం నాటి సమావేశంలో ఐసీఏకు నిధులను కేటాయించే అవకాశం ఉందని పరిశీలకులు అంటున్నారు. ఐసీఏ గత ఏడాది అక్టోబర్‌లో సమావేశమై, 15 నుంచి 20 కోట్ల రూపాయలను కేటాయించాల్సిందిగా మీసీసీఐని కోరుతూ ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించింది. తొలి విడత బోర్డు ఆర్థిక సాయం చేస్తుందని, ఆతర్వాత ఐసీఏ స్వయం సమృద్ధిని సాధించాలని సుప్రీం కోర్టు ఇది వరకే స్పష్టం చేసింది. కాగా, ఐసీఏకు ఎంత మొత్తం కేటాయిస్తారన్నది ఆసక్తి రేపుతున్నది.
బీసీసీఐ మొట్టమొదటి అంబూడ్స్‌మన్‌గా నియమితులైన జస్టిస్ డీకే జైన్ ఎథిక్స్ అధికారిగా అదనపు బాధ్యతలను నిర్వహిస్తున్నారు. సచిన్ తెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, వీవీఎస్ లక్ష్మణ్, కపిల్ దేవ్ వంటి హేమాహేమీలు పరస్పర ప్రయోజనాలున్న పదవుల్లో కొనసాగుతున్నారన్న ఆరోపణలపై వారి వివరణ కోరి జైన్ సంచలనం సృష్టించారు. ఎథిక్స్ అధికారిగా ఆయన కొనసాగితే, ఎంతో మంది ప్రస్తుత, మాజీ క్రికెటర్లకు సమస్యలు తప్పవన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది. అందుకే, గంగూలీ అధ్యక్షతన సమావేశం కానున్న బీసీసీఐ పాలక మండలి సమావేశంలో కొత్త ఎథిక్స్ అధికారిని ఎంపిక చేసే అవకాశం ఉందన్న వాదన బలంగా వినిపిస్తున్నది. ఇలావుంటే, గత ఏడాది నవంబర్ మాసంలో సీఎఫ్‌ఓ సంతోష్ రాంగ్నేకర్ రాజీనామా చేశాడు. అతని స్థానంలో ఇప్పుడు కొత్త సీఎప్‌ఓను ఎంపిక చేయాల్సి ఉంది. కాగా, డిసెంబర్ మాసంలో కంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్ (కాగ్) నామినేట్ చేసిన అల్కా రెహానీ భరద్వాజ్ తొలిసారి బీసీసీఐ పాలక మండలి సమావేశానికి హాజరవుతుంది. తన దృష్టికి వచ్చిన వివిధ ఫిర్యాదులతోపాటు, నిబంధనావళి ఉల్లంఘన జరుగుతున్నదా అనే అంశాన్ని కూడా ఆమె పరిశీలిస్తుంది.
*చిత్రం...సౌరవ్ గంగూలీ