క్రీడాభూమి

ఆసిస్ పర్యటనలో డే నైట్ టెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 16: రానున్న ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియా డే నైట్ టెస్టు ఆడే అవకాశం కనిపిస్తోంది. బీసీసీఐ అధికారులు చెప్పిన ప్రకారం ఈ ఏడాది చివర్లో భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగు టెస్టుల సిరీస్ జరగాల్సి ఉంది. అందులో ఒక టెస్టును బ్రిస్బేన్స్ లేదా అడిలైడ్ వేదికగా డే నైట్ మ్యాచ్‌గా నిర్వహించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఇదిలాఉంటే కోహ్లీసేన గతేడాది ఈడేన్‌గార్డెన్స్ వేదికగా బంగ్లాదేశ్‌తో తన తొలి డే నైట్ టెస్టు ఆడిన విషయం తెలిసిందే. అయతే గత భారత పర్యటనలో ఆస్ట్రేలియా మూడు వనే్డల సిరీస్ ఆడగా, అప్పుడే ఆస్ట్రేలియా, బీసీసీఐ మధ్య ఈ ఒప్పందం కుదిరినట్లు సమాచారం. మరోవై పు ఆడిన తొలి డే నైట్ టెస్టులో విజయం సాధించిన కోహ్లీసేన పింక్ బాల్ మ్యాచ్‌పై ఉత్సహాంగా ఉంది. అయతే గతంలో ఆస్ట్రేలియా పలుమార్లు డే నైట్ టెస్టు ఆడాలని భారత్‌ని విజ్ఞప్తి చేసినా అందుకు తాము సిద్ధంగా లేమంటూ బీసీసీఐ తేల్చి చెప్పింది. భారత్ కూడా మొదటి డే నైట్ టెస్టులో విజయం సాధించడం, ఆ మ్యాచ్ యావత్ క్రికెట్ అభిమానులను ఆకర్షించడంతో పాటు కోహ్లీ సేన కూడా సిద్ధం కావడంతో బీసీసీఐ ఈ మ్యాచ్‌పై సానుకూలత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఇదే విషయమై బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ మాట్లాడుతూ ఆస్ట్రేలియా పర్యటనలో భారత్ డే నైట్ టెస్టు ఆడుతుందని స్పష్టం చేశాడు. దీనిపై త్వరలోనే అధికార ప్రకటన వస్తుందని పేర్కొన్నాడు.