క్రీడాభూమి

హమ్మయ్య.. గాడిలో పడ్డారు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హామిల్టన్: టెస్టు సిరీస్‌కు ముందు న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఈ మ్యాచ్ ప్రారంభంలో ముందుగా టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్‌కు దిగి తొలి ఇన్నింగ్స్‌లో 263 పరుగులకే కుప్పకూలింది. హనుమ విహారి (101), చతేశ్వర్ పుజారా (93)లు మాత్రమే రాణించారు. స్కాట్ కుగ్లిజైన్, ఇష్ సోదీ చెరో మూడు వికెట్లు తీసుకోగా, జాక్ గిబ్సన్ 2, జేమ్స్ నీషమ్ 1 వికెట్ పడగొట్టారు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌కు దిగిన కివీస్ భారత పేస్ దెబ్బకు 235 పరుగులకే కుప్పకూలింది. టీమిండియా బౌలర్లలో మహ్మద్ షమీ 3 వికెట్లు పడగొట్టగా, జస్ప్రీత్ బుమ్రా, ఉమేష్ యాదవ్, నవదీప్ సైనీ రెండేసి, రవిచంద్రన్ అశ్విన్ 1 వికెట్ దక్కించు కున్నారు. తొలి ఇన్నింగ్స్‌లో వచ్చిన 28 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్‌కు దిగిన టీమిండియా చివరి రోజు ఆదివారం 4 వికెట్లు కోల్పోయ 252 పరుగులు చేసింది. ఓపెనర్ పృథ్వీ షా (39) ఫర్వాలేదనిపించగా, మరో ఓపెనర్ బర్త్‌డే బాయ్ మయాంక్ అగర్వాల్ (81) అర్ధ సెంచరీ సాధించి రిటైర్డ్ హార్ట్‌గా వెనుదిరిగాడు. అయతే ఆ తర్వాత వచ్చిన శుభ్‌మన్‌గిల్ (8) మాత్రం మళ్లీ నిరాశ పరిచాడు. దీంతో నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన రిషభ్ పంత్ (70) అర్ధ సెంచరీతో ఆకట్టుకున్నాడు. చివరి రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా (30), రవిచంద్రన్ అశ్విన్ (16) నాటౌట్‌గా క్రీజులో ఉన్నారు. దీంతో అంపైర్లు మ్యాచ్‌ను డ్రాగా ప్రకటించారు.
మొత్తానికి రాణించారు..
గత కొద్దిరోజులుగా బ్యాటింగ్‌లో తక్కువ స్కోర్లకే పెవలియన్‌కు చేరుతూ అభిమానుల విమర్శలు ఎదుర్కొన్న టీమిండియా యువ ఆటగాళ్లు మయాంక్ అగర్వాల్, రిషభ్ పంత్ ప్రాక్టీస్ మ్యాచ్‌లో అర్ధ సెంచరీలతో చెలరేగారు. అయతే టెస్టు సిరీస్‌కు ముందే వీరిద్దరూ రాణించడంతో జట్టు మేనేజ్‌మెంట్ సహా అభిమానులు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయతే తొలి ఇన్నింగ్స్‌లో 7వ స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన రిషభ్ పంత్ రెండో ఇన్నింగ్స్ లో నాలుగో వికెట్‌గా వచ్చి రాణించడం విశేషం. మరోవైపు ఈ ప్రాక్టీస్ మ్యాచ్‌లో వృద్ధిమాన్ సాహానే వికెట్ కీపింగ్ చేయడంతో, రానున్న టెస్టు సిరీస్‌లో సాహానే కీపింగ్ బాధ్యతలు చేస్తాడని తెలుస్తోంది. ఇదిలాఉంటే రెగ్యులర్ ఓపెనర్లు శిఖర్ ధావన్, రోహిత్ శర్మతో పాటు బ్యాకప్ ఓపెనర్ లోకేష్ రాహుల్ సైతం టెస్టు సిరీస్‌కు దూరం కావడంతో రిషభ్ పంత్‌ను జట్టులోకి తీసుకున్నా బ్యాట్స్‌మన్‌గానే తీసుకుంటారని తెలుస్తోంది. మరోవైపు గత వనే్డల్లో విఫలమైన బర్త్‌డే బాయ్ మయాంక్ అగర్వాల్ ప్రాక్టీస్ మ్యాచ్‌లో రాణించడంతో టెస్టు జట్టులో బెర్త్ ఖాయమైనట్టే తెలుస్తోంది. ఇక శుభ్‌మన్ గిల్ ఈ రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ తొలి ఇన్నింగ్స్‌లో (0) రెండో ఇన్నింగ్స్‌లో (8) సింగిల్ డిజిట్‌కే పరిమితమవడంతో తుది జట్టులో చోటు కష్టంగానే మారింది.

*చిత్రం...మయాంక్ అగర్వాల్, పృథ్వీ షా