క్రీడాభూమి

జట్టులోకి బౌల్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెల్లింగ్టన్, ఫిబ్రవరి 17: న్యూజిలాండ్ సీనియర్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ భారత్‌తో ఈ నెల 21 నుంచి ప్రారంభమ య్యే టెస్టు సిరీస్‌కు తిరిగి జట్టులో చేరాడు. గత ఆస్ట్రేలి యా పర్యటనలో బాక్సింగ్ డే టెస్టు సందర్భంగా గాయప డ్డ బౌల్ట్ టెస్టు సిరీస్ ప్రారంభానికి ముందు తన ఫిట్‌నెస్ నిరూపించుకోవడంతో జట్టుతో కలిశాడు. రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు సోమవారం 13 మందితో కూడిన జట్టును ప్రకటిం చింది. జట్టులో బౌల్ట్‌తో పాటు ఇటీవల భారత్‌తో జరిగిన పరిమిత ఓవర్ల క్రికెట్‌లో అరంగేట్రం చేసిన పేసర్ కైల్ జెమిసన్‌తో పాటు ఎడమ చేతి వాటం స్పిన్నర్ అజాజ్ పటేల్ పేరును కూడా సెలక్టర్లు జాబితాలో చేర్చారు. మరోవైపు సీనియర్ ఆల్‌రౌండర్ రాస్ టేలర్ ఈ టెస్టుతో 100వ టెస్టు ఆడనున్నాడు. దీంతో మూడు ఫార్మాట్లలో 100 మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా టేలర్ రికార్డు సృష్టించనున్నాడు.
న్యూజిలాండ్ జట్టు: కేన్ విలియమ్సన్ (కెప్టెన్), టామ్ బ్లండెల్, ట్రెంట్ బౌల్ట్, కొలిన్ డీ గ్రాండ్ హోం, కైల్ జెమీసన్, టామ్ లాథమ్, డరియల్ మిచెల్, హెన్రీ నికోల్స్, అజాజ్ పటేల్, టీమ్ సౌథీ, రాస్ టేలర్, నెల్ వాగ్నార్, బీజే వాట్లింగ్.