క్రీడాభూమి

కెప్టెన్సీకి డుప్లెసిస్ గుడ్ బై

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జొహానె్నస్‌బర్గ్, ఫిబ్రవరి 17: దక్షిణాఫ్రికా కెప్టెన్, స్టార్ ప్లేయర్ ఫఫ్ డుప్లెసిస్ తన కెప్టెన్సీకి గుడ్ బై చెప్పాడు. ఇక నుంచి అన్ని ఫార్మాట్ల నుంచి కెప్టెన్‌గా తప్పుకొని, ఆటగాడిగా మాత్రమే కొనసాగుతానని ప్రకటించి క్రికెట్ దక్షిణాఫ్రికా బోర్డును షాక్‌కు గురిచేశాడు. గత కొద్ది రోజుల క్రితమే తాను ఈ విషయమై సరైన నిర్ణయం తీసుకుంటానంటూ ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న డుప్లిసెస్ నిర్ణయం ఇటు బోర్డుతో పాటు అభిమానులను విస్మయానికి గురిచేసింది. కెప్టెన్సీగా తాను ఒత్తిడి ఎదుర్కొంటున్నట్లు పలు సందర్భాల్లో పేర్కొన్నాడు. అయతే ప్రపంచకప్‌లో దారుణ ఓటమి, ఆ తర్వాత టీమిండియాతో టెస్టు సిరీస్‌ను దక్షిణాఫ్రికా డుప్లెసిస్ కెప్టెన్సీలో 3-1 తేడాతో కోల్పోయంది. అయతే జట్టుకు కొత్త నాయకత్వం తప్పనిసరి కావడంతోనే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నాడు. విశ్రాంతి కారణంగా ఇటీవల స్వదేశంలో ఇంగ్లాండ్‌తో జరిగిన వనే్డ, టీ20 సిరీస్‌లను సైతం ఆడలేకపోయాడు. తన నిర్ణయానికి ఇదే సరైన సమయమని, క్వింటన్ డీకాక్ కెప్టెన్సీకి సమర్థుడని పేర్కొన్నాడు. అయతే డుప్లెసిస్ కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటన చేయడంతో ఐసీసీ తన ట్విటర్ అకౌంట్‌లో బ్రేకింగ్ అని పోస్టు చేయడం విశేషం.