క్రీడాభూమి

హర్మన్ సేన బోణీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్రిస్బేన్స్: మహిళల టీ20 ప్రపంచకప్‌లో భాగంగా మంగళవారం వెస్టిండీస్‌తో జరిగిన వామప్ మ్యాచ్‌లో భారత్ 2 పరుగుల తేడాతో విజయం సాధించింది. అంతకుముందు టాస్ గెలిచిన టీమిండి యా ముందుగా బ్యాటింగ్‌కు దిగింది. ఇటీవలి కాలంలో సూపర్ ఫామ్‌లో ఉన్న ఓపెనర్ స్మృతీ మంధాన (4) తక్కువ స్కోరుకే అవుటై నిరాశ పరిచింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన జెమీమా రోడ్రిగ్స్ (0) పరుగులేమీ చేయకుండానే పెవిలియన్‌కు చేరింది. ఇక ఆ మరుసటి ఓవర్‌లోనే మరో ఓపెనర్ షఫాలీ వర్మ (12) కూడా క్రీజు వదలడంతో భారత్ 17 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయ కష్టాల్లో పడింది. అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (11), దీప్తి శర్మ (21) కొద్దిసేపు పోరాడినా అనీషా మహ్మద్ బౌలింగ్‌లో వికెట్లను చేజార్చుకున్నారు. పూజా వస్త్రాకర్ (13), వికెట్ కీపర్ తనియ భటియా (10) తొందరగానే అవుటైనా, చివర్లో శిఖా పాండే (24, నాటౌట్), పూనమ్ యాదవ్ (4,నాటౌట్)తో కలిసి చెలరేగడంతో భారత్ నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయ 107 పరుగులు చేసింది. విండీస్ బౌలర్లలో షమీలియా కానెల్, అనీషా మహ్మద్ రెండేసి వికెట్లు తీసుకోగా, చినెల్లి హెన్రీ, ఫై ఫ్లేచర్, కెప్టెన్ స్టఫైన్ టేలర్, అలియా అల్లైన్ ఒక్కో వికెట్ పడగొట్టారు.
గెలిచినట్లే కనిపించి..
అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన వెస్టిండీస్ జట్టు బ్యాటర్లు ప్రారంభంలో చెలరేగి ఆడారు. ముఖ్యంగా లీ-అన్-కిర్బీ భారత బౌలర్లకు చుక్కలు చూపించింది. అయతే జట్టు స్కోరు 23 పరుగుల వద్ద బ్రిట్నీ కూపర్ (1)ని శిఖా పాండే తన బౌలింగ్‌లో రిటర్న్ క్యాచ్ ద్వారా పెవిలియన్‌కు పంపింది. ఆ తర్వాత కొద్దిసేపటికే మరో ఓపెనర్ లీ-అన్-కిర్బీ (42) దీప్తిశర్మకు వికెట్ల ముందు దొరికిపోయంది. ఇక తర్వాత వరుసగా స్టఫైన్ టేలర్ (16) రనౌట్‌గా వెనుదిరగ్గా, హెలీ మాథ్యూస్ (25), చెడియన్ నేషన్ (0)ను పూనమ్ యాదవ్ పెవిలియన్‌కు పంపగా, డీంద్రా డాటిన్ (1) హర్మన్ ప్రీత్ బౌలింగ్‌లో అవుట్ అయంది. ఇక చివరి బంతికి విజయానికి 2 పరుగులు అవసరం కాగా, చినెల్లీ హెన్రీ (17) పూనమ్ యాదవ్ బౌలింగ్‌లో క్యాచ్ అవుట్ గా వెనుదిరగడంతో భారత్ విజయం సాధించింది. టీమిండియా బౌలర్లలో పూనమ్ యాదవ్ 3 వికెట్లు పడగొట్టగా, శిఖా పాండే, దీప్తి శర్మ, హర్మన్‌ప్రీత్ కౌర్ ఒక్కో వికెట్ తీశారు.
శ్రీలంక 10 వికెట్ల తేడాతో విజయం..
ఆడిలైడ్: ఆడిలైడ్ వేదికగా జరిగిన మరో మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌పై శ్రీలంక జట్టు 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లీష్ జట్టు నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయ 122 పరుగులు చేసింది. వికెట్ కీపర్ అబీ ఎల్లీన్ జోన్స్ (23), టామీ బీవౌంట్ (23), కెప్టెన్ హీదర్ నైట్ (19) ఫర్వాలేదనిపించారు. శ్రీలంక బౌలర్లలో శశికళ సిరివర్దనే 4 వికెట్లు తీయగా, కెప్టెన్ చమరి ఆటపట్టు 3 వికెట్లు పడగొట్టింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన లంక జట్టు 12.3 ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా విజయం సాధించింది. కెప్టెన్ చమరి ఆటపట్టు (50 బంతుల్లో 78), హాసిని పెరీరా (29) జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు.
దక్షిణాఫ్రికాపై ఆస్ట్రేలియా..
ఆడిలైడ్: మహిళ టీ20 ప్రపంచకప్ సన్నాహాక మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా జట్టుపై ఆస్ట్రేలియా 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ముందుగా టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయ 147 పరుగులు చేసింది. కెప్టెన్ డేన్ వన్ నీకెర్క్ (62) అర్ధ సెంచరీ సాధించగా, లిజెల్లీ లీ (29), మరిజనె్న కప్ (22) రాణించారు. ఆస్ట్రేలియా బౌలర్లలో డెలిస్సా కిమ్మిన్స్ 2 వికెట్లు పడగొట్టగా, మెగన్ స్కట్, జెస్ జొనస్సెన్, నికోలా క్యారీ ఒక్కో వికెట్ తీశారు. అనంతరం లక్ష్య ఛేదనలో మరో మూడు బంతులు మిగిలి ఉండగానే ఆసిస్ 6 వికెట్లు కోల్పోయ విజయం సాధించింది. కెప్టెన్ మెగ్ లన్నింగ్ (47), రఖేల్ మెన్స్ (39) జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించారు.

*చిత్రం... శిఖా పాండే (24, నాటౌట్)