క్రీడాభూమి

ఒలింపిక్స్‌కు ‘కోవిడ్’ భయం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టోక్యో, ఫిబ్రవరి 19: టోక్యో ఒలింపిక్స్‌ను కరోనా భయం వెంటాడుతున్నది. ఈ ఏడాది జూలై 24 నుంచి ఆగస్టు 9వ తేదీ వరకూ జరిగే ఈ మెగా ఈవెంట్‌లో ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల నుంచి అథ్లెట్లు పోటీపడతారు. ఆరు వందలకుపైగా సభ్యులతో కూడిన బృందాన్ని పంపనున్నట్టు చైనా ఇది వరకే ప్రకటించింది. కరోనా వైరస్‌గా సుపరిచితమైన కోవిడ్ చైనాలో ఉహాన్ నుంచి ప్రపంచమంతా వ్యాపిస్తున్న నేపథ్యంలో, చైనా అథ్లెట్లు వస్తే తాము రాబోమని ఎంతో మంది అథ్లెట్లు భీష్మించుకునే ప్రమాదం లేకపోలేదు. కోవిడ్ కారణంగా 1,400 మందికిపైగా మృతి చెందారని, సుమారు 64,000 మంది ఈ వైరస్ లక్షణాలతో చికిత్స పొందుతున్నారని చైనా ప్రభుత్వం అధికారికంగా వెల్లడిస్తున్న సమాచారం. ఒలింపిక్స్ సమీపిస్తున్న కొద్దీ ఇంకెంత మంది మృతి చెందుతారో? ఇంకెంత మందికి ఈ వైరస్ సోకుతుందోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు అమెరికాసహా ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే 26 దేశాలకు కోవిడ్ వ్యాపించినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ప్రకటించింది. అంతేగాక, హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించింది. చైనా నుంచి వచ్చే అథ్లెట్లకు వైరస్ సోకే ప్రమాదం లేకపోలేదని, వారి నుంచి తమకు కూడా అది వ్యాపిస్తుందని ఇతర దేశాలకు చెందిన అథ్లెట్లు అనుమానించే అవకాశాలున్నాయి. రియో ఒలింపిక్స్ సమయంలో జికా వైరస్ భయం అథ్లెట్లను వెంటాడింది. జాసన్ డే, రొరీ మెకల్‌రొయ్ వంటి హేమాహేమీ గోల్ఫర్లు రియోకు వెళ్లలేదు. అప్పటి జికా వైరస్ గురించి అంతగా ప్రచారం కాలేదు. పైగా, డబ్ల్యూహెచ్‌ఓ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించలేదు. అంతేగాక, ఇప్పుడు ఉన్న స్థాయిలో అప్పుడు సోషల్ మీడియా విస్తృతం కాలేదు. ఈ కారణాలతో జికా వైరస్ భయం వెంటాడినప్పటికీ, రియో ఒలింపిక్స్ సజావుగానే ముగిశాయి. టోక్యోలో అలాంటి పరిస్థితే ఉంటుందా అన్నది ఇప్పుడు ప్రధాన ప్రశ్న. కరోనా వైరస్ పేరు చెప్తేనే ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. పైగా జపాన్‌కు కూడా ఈ వైరస్ వ్యాపించింది. ఓ వృద్ధురాలు ఈ వైరస్ లక్షణాలతో మృతి చెందడం, 33 మంది ఆసుపత్రుల్లో చేరడం సహజంగానే భయాందోళనలను మరింతగా పెంచుతున్నాయి. చైనా నుంచి బయలుదేరిన ఒక నౌక సుమారు వారం రోజులుగా యొకొహమా ఓడ రేవుకు దూరంగా, సముద్ర జలాల్లోనే ఉంది. అందులో సుమారు 200 మంది వరకూ కరోనా వైరస్ సోకిన వారు ఉన్నట్టు సమాచారం. అందుకే, ఆ నౌకను ఓడ రేవులోకి జపాన్ అధికారులు అనుమతించడం లేదు. చైనానే ఆందోళన చెందుతున్న తరుణంలో, ఆ దేశం నుంచి వచ్చే అథ్లెట్లను మిగతా వారంతా అనుమానంగానే చూస్తారనడంలో సందేహం లేదు. చైనా తరఫున పోటీపడనున్న అథ్లెట్లలో చాలా మంది వివిధ దేశాల్లో శిక్షణ పొందుతున్నారని, కాబట్టి కరోనా వైరస్ సమస్య ఉత్పన్నం కాదని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఒసీ) ఆధ్వర్యంలోని కో-ఆర్డినేషన్ కమిటీ చీఫ్ జాన్ కోట్స్ వాదిస్తున్నాడు. అదే సమయంలో, ఈ అంశం విస్తృతంగా ప్రచారం చెందాలని, లేకపోతే, కరోనా వైరస్ ప్రభావం టోక్యో ఒలింపిక్స్‌పై ప్రభావం చూపడం ఖాయమని వ్యాఖ్యానిస్తున్నాడు.
ఇలావుంటే, ఇప్పటికే పలు అంతర్జాతీయ టోర్నీలు కరోనా వైరస్ కారణంగా రద్దయ్యాయి. చైనాలో జరగాల్సిన బాక్సింగ్, బాస్కెట్‌బాల్ క్వాలిఫయర్స్ వాయిదా పడ్డాయి. ఏప్రిల్‌లో జరగాల్సిన షాంఘై ఫార్ము వాన్ గ్రాండ్ ప్రీని రద్దు చేశారు. మొట్టమొదటి వియత్నాం గ్రాండ్ ప్రీ రేసు జరుగుతుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ జాబితా క్రమంగా పెరుగుతున్నది. టోక్యో ఒలింపిక్స్‌పై ప్రభావం చూపే అవకాశాలు లేకపోలేదన్న వాదన బలంగా వినిపిస్తున్నది.